అమాయకులు రోడ్డున పడ్డారు : కిషన్‌రెడ్డి

by Shyam |   ( Updated:2022-08-31 14:08:40.0  )
Kishan Reddy
X

భైంసా ఘటనలో అమాయకులు రోడ్డున పడ్డారని, పోలీసులు అప్రమత్తంగా లేకపోవడంతోనే ఈ దాడులు జరిగాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మల్ జిల్లా భైంసాలో ఇవాళ కిషన్‌రెడ్డి బృందం పర్యటించింది. ఆయన వెంట పార్టీ రాష్ర్ట అధ్యక్షులు లక్ష్మణ్, ఎంపీలు అరవింద్,సంజయ్, సోయం బాపురావు ఉన్నారు. అనంతరం కిషన్‌రెడ్డి మాట్లాడుతూ… బాధితులకు ఇప్పటివరకూ రాష్ర్ట ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దాడుల్లో దాదాపు 101మంది నష్టపోయారని గుర్తించామని కేంద్రం తరపున నివేదిక సేకరించామన్నారు. రాష్ర్ట ప్రభుత్వంతో మట్లాడి నష్టపరిహారం ఇవ్వాలని కోరుతామన్నారు. మూడు నెలల జీతాన్ని బాధితులకు సాయంగా ప్రకటిస్తున్నా అని హామీ ఇచ్చారు. మా ఎంపీల తరపున కూడా రూ.25లక్షలు ఇస్తున్నామన్నారు.

Advertisement

Next Story

Most Viewed