అయ్యో… సామాన్యులు అప్పటివరకు ఆగాల్సిందేనా?

by Anukaran |   ( Updated:2020-11-08 06:38:00.0  )
అయ్యో… సామాన్యులు అప్పటివరకు ఆగాల్సిందేనా?
X

దిశ, వెబ్ డెస్క్ : కరోనా వైరస్‌ను నిలువరించే టీకా పొందడానికి కామన్ మ్యాన్ 2022దాకా వెయిట్ చేయాల్సిందేనని ఎయిమ్స్ డైరెక్టర్, కరోనావైరస్ కట్టడి టాస్క్ ఫోర్స్ సభ్యుడు రణదీప్ గులేరియా తెలిపారు. భారత మార్కెట్‌లో కరోనా టీకా మిగతా ఔషధాల్లాగే లభించాలంటే కనీసం మరో ఏడాదికాలం పడుతుందని అన్నారు. అంతేకాదు, టీకా వేసినంత మాత్రానా కరోనా మహమ్మారి సమసిపోదని ఓ ఇంటర్వ్యూలో ఆయన స్పష్టం చేశారు. సాధారణ పౌరులు కరోనా టీకా పొందడానికి ఏడాదికి పైనే పడుతుందని అన్నారు.

టీకా విజయవంతమైన తర్వాత ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయన్న ప్రశ్నకు సమాధానమిస్తూ, ‘తొలి సవాలు టీకా పంపిణీ రూపంలో ఉంటుంది. దేశంలోని మారుమూల ప్రాంతాలకూ వ్యాక్సిన్‌ చేర్చాలి. శీతల గిడ్డంగుల ఏర్పాట్లు, సరిపడా సిరంజీలను సమకూర్చుకోవడం అవసరం. వాటన్నింటినీ అన్ని ప్రాంతాలకూ తరలించే సదుపాయాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఇక రెండో సవాలు, మనం పంపిణీ చేస్తున్న టీకా కంటే ప్రభావవంతమైన మరో టీకా అందుబాటులోకి వస్తే ఏం చేయాలి? కొత్త టీకాను ఎవరికివ్వాలి? ఇలాంటి ఎన్నో నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది’ అని వివరించారు.

Advertisement

Next Story

Most Viewed