- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గతేడాది ఉన్న సందడేదీ.. హుషారేదీ!
దిశ ప్రతినిధి, మెదక్: రాష్ట్రంలో వినాయక చవితి పండుగకు ప్రతిఏటా ఉండే సందడి.. హషారు.. ఈ ఏడు కరోనా వల్ల మిస్సయ్యాయి. అందరూ ఇంట్లోనే పూజలు నిర్వహించుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేయడంతో ఏమీ చేయలేని స్థితిలో ఉండిపోయారు. దానికి తోడు రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో ఎవరి భయం వారికి ఉంది. దీంతో రాష్ట్ర రాజధాని నగరంతో పాటు, పలు జిల్లాల్లో గణేశ్ ఉత్సవాలు సాదాసీదాగా ప్రారంభమయ్యాయి.
ఈ నేపథ్యంలోనే ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఆయా పట్టణాలు, గ్రామాల్లో వినాయక చవితి వేడుకల సందడి అసలు కనిపించడం లేదు. పండుగకు వారం రోజుల నుంచి ఉత్సవ నిర్వాహకులు, యువకులు చిన్నారులు, విగ్రహాలు ప్రతిష్టించేందుకు మండపాల ఏర్పాటులో నిమగ్నమై సందడి చేసేవారు. డప్పు చప్పుల్లు గ్రామాలు, పట్టణాల్లోని గల్లీ గల్లీలో వినిపించేవి. వాడవాడల్లో వినాయక విగ్రహాల ఏర్పాటుతో పాటు, మైకుల సౌండ్స్ కూడా వినిపించేవి. కానీ, ఈసారి అవన్నీ సైలంట్ అయ్యాయి. కారణం కరోనా ఎఫెక్ట్..
దానికితోడు, మూడు అడుగులకు మించి విగ్రహాలను పెట్టవద్దని పోలీసులు ఉత్సవ నిర్వాహకులకు సూచించడంతో పట్టణాల్లో పండగ సందడి లేక వెలవెలపోయింది. కొవిడ్-19 నిబంధనలు పాటించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో, ఎవరూ బయటకు వచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేయడం లేదని తెలుస్తోంది.