దూరం.. దూరం… కరోనా కారణం

by Shyam |
దూరం.. దూరం… కరోనా కారణం
X

దిశ, నిజామాబాద్: దూరం.. దూరం పాటించాలి. బేరమేమీలేదు.. ధర మీముందే ఉంటంది. ఇలాగే ఉంటే ఏదీ మన దరిచేరదన్న విధానాన్ని వారు సక్రమంగా అక్కడ అమలు పరుస్తూ ప్రజాశ్రేయస్సుకు పాటుపడుతున్నారు. అదేమిటో మీరే చూడండి.. ప్రత్యేక కథనంలో..

ప్రస్తుతం కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్నే భయపెడుతోంది. బయటి దేశాల్లో విలయం తాండవం సృష్టిస్తోన్న ఈ మహమ్మారి మన దేశ గడపను దొక్కింది. ఇప్పుడు అది రోజురోజుకు విజృంభణ చేస్తూ ఇక్కడ కూడా విలయతాండవం చేస్తున్నది. దీంతో కేంద్ర, ప్రభుత్వాలు దానిని నివారించేందుకు పలు చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. అయితే.. అందులో భాగంగా ప్రస్తుతం దేశమంతటా కూడా లాక్ డౌన్ కొనసాగుతున్నది. లాక్ డౌన్ సమయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. అందులో ఒకటి.. ప్రతి ఒక్కరూ కూడా సామాజిక దూరం పాటించాలని పేర్కొంది. అదేవిధంగా లాక్ డౌన్ సమయంలో కొన్ని అవసరాలకు సంబంధించి ప్రజలకు కొన్ని సమయాల్లో కొంత వెసులుబాటు కల్పించింది. అందులో భాగంగా నిత్యవసరాలు కొనుకునేందుకు ప్రతిరోజు వారికి పరిమిత సమయంలో అనుమతులు కల్పించిని విషయం కూడా తెలిసిందే.

అయితే.. నిజామాబాద్ లో మాత్రం కూరగాయలు అమ్మే చోట ప్రజలు ఎక్కువ సంఖ్యలో గుమిగూడి ఉంటున్నారు. సామాజిక దూరం పాటించడంలేదు. దీనిని గమనించిన మార్కెటింగ్ శాఖ అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. నగరంలో ఎక్కడ ఓపెన్ ప్లేస్ లు ఉంటే అక్కడ కూరగాయల మార్కెట్లు తెరిచేందుకు మార్కెటింగ్ శాఖ అధికారులు వీలు కల్పిస్తున్నారు. దీంతో నిన్న మొన్నటి వరకు కొనసాగిన ప్రయాణ ప్రాంగణాలు, క్రీడా మైదానాలు, విద్యా సంస్థల మైదానాలు ఇప్పుడు మార్కెట్లుగా మారాయి. అదేవిధంగా ఇప్పటివరకు రోడ్లపై ఉన్నటువంటి పాత మార్కెట్ లలో ఇరుకు గల్లీ సందులలో ఉండే కూరగాయల మార్కెట్లను ఓపెన్ ప్లేస్ లలోకి మార్చేశారు.

ప్రస్తుతం నగరంలో ఉన్నటువంటి మూడు పాత మార్కెట్ల స్థానంలో నగరంలోని ప్రభుత్వ ఐటీఐ గ్రౌండ్ లో, కలెక్టరేట్ మైదానంలో మరొకటి, పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో మార్కెట్లను ఏర్పాటు చేయనున్నారు. అదేవిధంగా.. బోధన్ లో ఖాళీగా ఉన్న ఆర్టీసీ బస్టాండ్ లో కూడా కూరగాయల మార్కెట్ ను ఏర్పాటు చేయనున్నారు. ఆర్మూర్ నగరంలో కూడా పలు ఓపెన్ ప్లేస్ లలో ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

అవి కూడా..

కూరగాయలు అధిక ధరలకు విక్రయించకుండా కూడా మార్కెటింగ్, పోలీస్ శాఖ అధికారులు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. ఎక్కువ ధరలకు విక్రయిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. దీంతో ప్రభుత్వం సూచనల మేరకు ఏర్పాటు చేసే బోర్డులపై ఉన్న ధరలకు మాత్రమే కూరగాయలు విక్రయిస్తున్నారు. దీంతో ప్రజలకు మేలు జరుగుతున్నది.

రేపో మాపో..

రేపో మాపో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పంపిణీ చేసే నిత్యవసర సరుకులను కూడా సామాజిక దూరం పాటించే విధంగా వెసులుబాటు ఉన్న స్థలాల్లో చేపట్టనున్నారు. ప్రజల అవసరాలను సమీపంలో తీర్చే మార్కెట్లకు ఆదరణ ఉండడంతో ఫుట్ పాత్ లపై అమ్మకాలు చేసే కూరగాయల విక్రేతలు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed