నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నిక వాయిదా

by Aamani |
నిజామాబాద్ ఎమ్మెల్సీ  ఎన్నిక వాయిదా
X

దిశ, న్యూస్ బ్యూరో: కరోనా లాక్‌డౌన్ దెబ్బకు విద్యార్థులకు పరీక్షలతో పాటు పొలిటికల్ లీడర్స్‌కు ఎన్నికలు సైతం వాయిదా పడుతున్నాయి. ఇప్పటికే దేశ‌ వ్యాప్తంగా మార్చి 26న జరగాల్సిన రాజ్యసభ ఎన్నికలు వాయిదా పడగా తాజాగా నిజామాబాద్ శాసనమండలి స్థానానికి జరగాల్సిన ఉప ఎన్నిక వాయిదా పడింది. స్థానిక సంస్థల కోటాలో ఉన్న ఈ స్థానం నుంచి టీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్న భూపతిరెడ్డి పార్టీ మారి కాంగ్రెస్‌లో చేరి అనర్హతకు గురయ్యారు. దీంతో ఈ ఉప ఎన్నిక వచ్చింది. షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 7 వతేదీన ఈ ఎన్నిక జరగాల్సి ఉంది. ఈ ఎన్నికల ప్రక్రియలో భాగంగా కోసం నామినేషన్ల విత్ డ్రా సైతం సోమవారంతో ముగిసింది.

Tags: mlc election, nizamabad, corona

Advertisement

Next Story

Most Viewed