కవితకు మళ్లీ నిరాశే.. ఆ ఎన్నిక వాయిదా

by Shyam |
elections
X

దిశ, నిజామాబాద్: నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక మరోసారి వాయిదా పడింది. ఏప్రిల్ మొదటి వారంలోనే జరగాల్సిన ఈ ఎన్నిక లాక్‌డౌన్ కారణంగా గతంలో వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే, మరోసారి ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు ఈసీ ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే మరో 45 రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు కేంద్ర ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆగస్టు మొదటి వారంలో నిజామాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఉపఎన్నిక జరిగే అవకాశముంది. కాగా, ఈ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ తరుఫున ఎమ్మెల్సీ అభ్యర్థిగా సీఎం కేసీఆర్ తనయా, మాజీ ఎంపీ కల్పకుంట్ల కవిత బరిలోకి దిగిన విషయం విధితమే. గెలుపు లాంఛనమైనా.. ఈసీ ఉత్తర్వులతో కవితకు మరోసారి కూడా నిరాశే ఎదురైందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed