నగరంలో కలెక్టర్ పర్యటన

by vinod kumar |
నగరంలో కలెక్టర్ పర్యటన
X

దిశ, నిజామాబాద్: లాక్ డౌన్ అమలు తీరును తెలుసుకునేందుకు జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి, మున్సిపల్ కమిషనర్ జితేష్ వి పాటిల్, సంబంధిత అధికారులతో కలిసి నగరంలో మంగళవారం పర్యటించారు. ఇందులో భాగంగా పెద్ద బజార్ వాటర్ ట్యాంక్ వద్ద క్లస్టర్ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం ఆసుపత్రిలో మరణించిన వ్యక్తి నివాస ప్రాంతాన్ని పరిశీలించారు. అత్యవసర పరిస్థితుల్లో కాలనీలోకి అధికారులు లేదా బాధితులు వెళ్లడానికి అవసరమైన ద్వారము ఏర్పాటు చేయాలన్నారు. ప్రజలకు మొబైల్ వాహనాల ద్వారా కూరగాయలు, నిత్యావసర వస్తువులు సరఫరా చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో కలెక్టర్ వెంట డీఈ రషీద్, టూ టౌన్ ఎస్ఐ ఆంజనేయులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

Tags: nizamabad, collector narayana reddy, lockdown, corona, virus, SI anjaneyulu,

Advertisement

Next Story