అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. 30 ఏళ్లకే లోకాన్ని విడిచిన నిజామాబాద్ వాసి

by Sumithra |   ( Updated:2021-10-18 11:59:13.0  )
అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. 30 ఏళ్లకే లోకాన్ని విడిచిన నిజామాబాద్ వాసి
X

దిశప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ నగరానికి చెందిన యువ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అమెరికాలో గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ఘటన సోమవారం సాయంత్రం ఆలస్యంగా వెలుగుచూసింది. నగరంలోని మారుతీ నగర్‌కు చెందిన సుధాకర్ నాయక్ విశ్రాంత బీసీ వెల్పేర్ ఆఫీసర్. ఆయనకు సాయి సుశాంత్ (30) అనే కొడుకు ఉన్నాడు. నిజామాబాద్‌లో బీటెక్ చదివాడు. ఆ తర్వాత అమెరికాలో ఎంఎస్ పూర్తి చేసి, అక్కడే మిచిగాన్ రాష్ట్రంలో పవర్ ఇండస్ట్రీస్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా స్థిరపడ్డాడు.

ఈనెల 12న తాను నివాసముంటున్న ఇంట్లోనే అనుకోకుండా గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలాడు. దీంతో అక్కడిక్కడే మృతి చెందినట్టు తెలుస్తోంది. ఈ మేరకు మృతుని కుటుంబసభ్యులకు సమాచారం అందించారు అమెరికా అధికారులు. సుధాకర్ నాయక్ ఏకైక సంతానం కావడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మంగళవారం సాయి సుశాంత్ మృతదేహం నిజామాబాద్‌కు రానున్నట్టు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed