- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
‘వి’క్టరీ పక్కా : నివేదా

మలయాళ క్యూటీ నివేదా థామస్ పొట్టి పిల్ల అయినా గట్టి పిల్లే. చాలా సెలక్టెడ్‌గా మూవీస్ చేస్తూ బెస్ట్ పర్‌ఫార్మర్‌గా కాంప్లిమెంట్స్ అందుకుంటోంది. కాగా తను నటించిన ‘వి’ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో విడుదల అవుతుండగా ప్రమోషన్స్‌తో బిజీగా ఉంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నివేదా.. సినిమా గురించి విశేషాలు షేర్ చేసుకుంది.
నేచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు హీరోలుగా తెరకెక్కిన మల్టీస్టారర్ మూవీ ‘వి’. నివేదా థామస్, అదితి రావు హైదరి కథానాయికలు. మోహనకృష్ణ ఇంద్రగంటి డైరెక్షన్‌లో వస్తున్న సినిమాలో తన పాత్ర చాలా స్పెషల్‌గా డిజైన్ చేశారని చెప్పింది. అపూర్వ అనే క్రైమ్ నావెల్ రైటర్‌గా కనిపించబోతున్న తనను ప్రేక్షకులు ఇష్టపడతారని ధీమా వ్యక్తం చేసింది. అసలు ‘వి’ అంటే మీనింగ్ ఏంటి? అని చాలా మంది అడుగుతున్నారని.. అది సినిమా చూస్తే అర్థం అవుతుందని చెప్పింది. ప్రస్తుతం ‘వి’ అంటే విక్టరీ అని, మూవీ యూనిట్ అదే కోరుకుంటుందని చెప్పింది.
‘వి’ సినిమాను తెరమీద చూడాలని ఆశపడినా.. పరిస్థితులు అనుకూలించలేదని, అమెజాన్ ప్రైమ్‌లో సెప్టెంబర్ 5న విడుదల కాబోతున్న ఈ చిత్రం సక్సెస్ అవుతుందని ధీమా వ్యక్తం చేసింది. ప్రేక్షకుల అభిప్రాయం, రివ్యూల కోసం వెయిట్ చేస్తున్నట్లు చెప్పింది. కానీ బిగ్ స్క్రీన్‌పై సినిమా చూస్తే వచ్చే కిక్కే వేరని అంటోంది నివేదా.