- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Ration cards: ఉగాది నుంచి సన్న బియ్యం.. రేషన్ కార్డులపై మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు

దిశ, డైనమిక్ బ్యూరో: రేషన్ కార్డుల పంపిణీ జరగబోతుందని, ఉగాది (ration cards) నుంచి నల్గొండ జిల్లాలో సన్న బియ్యం పంపిణీ జరుగుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar Goud) స్పష్టం చేశారు. ఆదివారం హుస్నాబాద్ ఐవోసీ కార్యాలయంలో అధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. సమీక్షలో సిద్దిపేట, కరీంగనర్, హనుమకొండ జిల్లాల అదనపు కలెక్టర్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. వేసవికాలంలో తాగునీటి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల ఎంపిక పారదర్శకంగా జరగాలని, పేదలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచనలు ఇచ్చారు. వరి కోతలు జరుగుతున్నాయి.. వరి కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఇదిలా ఉండగా మంత్రి పొన్నం ప్రభాకర్ ఇవాళ ఎక్స్ వేదికగా ఆసక్తికర పోస్ట్ చేశారు. గజ్వేల్ ఎమ్మెల్యే, మాజీ సీఎం కేసీఆర్ గజ్వేల్ నియోజకవర్గానికి రావడం లేదని సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు తుంకుంట నర్సారెడ్డి, సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ నుంచి రాజ్ భవన్ వరకు చేస్తున్న పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. పాదయాత్రలో భాగంగా ఇవాళ ఉదయం రాజీవ్ కన్వెన్షన్‌లో బస చేసిన తుంకుంట నర్సారెడ్డి, గజ్వేల్ కాంగ్రెస్ నేతలను సత్కరించినట్లు పేర్కొన్నారు.