ఓటీటీలోకి వచ్చేస్తున్న సందీప్ కిషన్ ‘మజాకా’సినిమా.. స్ట్రీమింగ్ ఆ స్పెషల్ డే నుంచే?

by Hamsa |
ఓటీటీలోకి వచ్చేస్తున్న సందీప్ కిషన్ ‘మజాకా’సినిమా.. స్ట్రీమింగ్ ఆ స్పెషల్ డే నుంచే?
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్(Sandeep Kishan), నక్కిన త్రినాథరావు(Nakkina Trinadha Rao) కాంబినేషన్‌లో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘మజాకా’(Mazaka). దీనిని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్(AK Entertainments), హాస్య మూవీస్ బ్యానర్స్‌పై రాజేష్ దండా, అనిల్ సుంకర నిర్మించారు. పూర్తి వినోదాత్మక చిత్రంగా వచ్చిన ఈ సినిమాలో రితూ వర్మ (Rithu Verma)హీరోయిన్‌గా నటించగా.. రావు రమేష్(Rao Ramesh), అన్షు అంబానీ(Anshu Ambani) ప్రధాన పాత్రలో కనిపించారు.

అయితే ‘మజాకా’చిత్రం భారీ అంచనాల మధ్య శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 26న గ్రాండ్‌గా థియేటర్స్‌లో విడుదలైంది. కానీ హిట్ సాధించలేకపోయింది. ప్రమోషన్స్ కోసం మూవీ టీమ్ కష్టపడినప్పటికీ ఫలితం దక్కకుండా అయింది. బాక్సాఫీసు వద్ద ఈ మూవీ కేవలం రూ. 20 కోట్లు మాత్రమే రాబట్టింది. ఇదిలా ఉంటే.. తాజాగా, ‘మజాకా’సినిమా నెల రోజులకే డిజిటల్ స్ట్రీమింగ్‌గా రెడీ అయినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ మూవీ హక్కులను ప్రముఖ సంస్థ జీ5 సొంతం చేసుకోగా.. మార్చి 28న ఉగాది పండుగ రోజు నుంచి స్ట్రీమింగ్ అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Next Story