బ్రేకింగ్.. ఐపీఎల్‌లోకి తిరిగి ఎంట్రీ ఇచ్చిన శార్దూల్ ఠాకూర్

by Mahesh |
బ్రేకింగ్.. ఐపీఎల్‌లోకి తిరిగి ఎంట్రీ ఇచ్చిన శార్దూల్ ఠాకూర్
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ (IPL) 2025లో భాగంగా 18వ సీజన్ శనివారం సాయంత్రం కోల్‌కత్తా వేదికగా అంగరంగ వైభవంగా ప్రారంభం అయింది. ఈ సీజన్‌కు ముందు మెగా వేలం (Mega Auction) జరగ్గా.. ఆయా జట్లు వదులుకున్న కీలక ప్లేయర్లను అధిక ధరకు దక్కించుకున్నారు. ఎవరూ ఉహించని విధంగా ఈ మెగా వేలంలో పలువురు కీలక ప్లేయర్లను ఏ జట్టు కనీసం బెస్ ధరకు కొనుగొలు చేయడానికి కూడా సాహసం చేయలేదు. దీంతో అలాంటి వారందరూ రిజిస్టర్ అవైలబుల్ ప్లేయర్ పూల్ లిస్టు (Current available player pool list)లో కొనసాగుతున్నారు. ఇదిలా ఉంటే ఎప్పటిలాగే.. ఐపీఎల్ (IPL) ను గాయాలు వెంటాడుతున్నాయి. సీజన్ ప్రారంభం కాకముందే పలువురు కీలక ప్లేయర్లు ఈ సీజన్ మొత్తానికి దూరం కావాల్సి వచ్చింది.

దీంతో ఆయా జట్లు గాయం కారణంగా జట్టుకు దూరం అయినవారి స్థానంలో RAPP నుండి ప్లేయర్లను తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా.. లక్నో(LSG) కు చెందిన యువ బౌలర్ మొహ్సిన్ ఖాన్ (Bowler Mohsin Khan) గాయం కారణంగా 2025 సీజన్ మొత్తానికి దూరం అయ్యాడు. అతని స్థానంలో శార్దూల్ ఠాకూర్ (Shardul Thakur) ను LSG తన జట్టులోకి తీసుకుంది. ఆల్ రౌండర్ అయిన శార్దూల్ ఠాకూర్‌ రిజిస్టర్డ్ అవైలబుల్ ప్లేయర్ పూల్ (RAPP) నుండి INR 2 కోట్ల బేస్ ధరతో లక్నో జట్టులో స్థానం దక్కించుకున్నారు. అతను భారతదేశం తరపున మూడు ఫార్మాట్లలో ఆడాడు. ఆయన ఐదు వేర్వేరు ఫ్రాంచైజీల తరపున 95 మ్యాచ్‌లు ఆడాడు.

Next Story