- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మళ్లీ మొదలైన నీటి కష్టాలు..
by Sumithra |

X
దిశ, కుబీర్ : కుబీర్ మండల కేంద్రంలో తాగునీటి కోసం రాత్రులు నిద్ర మానుకొని నీళ్ల కోసం వెతుకులాడే పరిస్థితి ఏర్పడింది. ధోబి గల్లీలోని మహిళలు ఒంటి గంట వరకు నీళ్ల కోసం తిరుగుతున్నారు. ఉదయం లేవగానే ఉపాధి, వ్యవసాయం పనులకు వెళ్ళలేకపోతున్నామని వాపోతున్నారు. నీటి కష్టాలను పరిష్కరించాలని పంచాయతీ కార్యాలయం చుట్టూ తిరిగిన పట్టించుకునే వారే లేరని మహిళలు మండిపడుతున్నారు.
మిషన్ భగీరథ నీరు ఎప్పుడు వస్తుందో ఎంత సేపు ఉంటుందో తెలియదు. కొందరు చిన్న మోటార్లను పెట్టుకొని లాగేసుకోవడంతో దిగువ ప్రాంతాల వారికి నీళ్లు రాలేని పరిస్థితి. ఓట్లు అడగడానికి వచ్చే నాయకులు ఎక్కడ కనిపించడం లేదని, సమస్యను ఎవరితో చెప్పుకోవాలని మహిళలు మండిపడుతున్నారు. తాగునీటి సమస్యను పరిష్కరించకపోతే నిరాహార దీక్షకు దిగుతానంటున్నారు.
Next Story