అక్కినేని అభిమానులకు గుడ్ న్యూస్.. అస్సలు ఊహించలేరుగా?

by Hamsa |
అక్కినేని అభిమానులకు గుడ్ న్యూస్.. అస్సలు ఊహించలేరుగా?
X

దిశ, సినిమా: అక్కినేని అఖిల్‌(Akkineni Akhil)కు పరిచయం అక్కర్లేదు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీకి వచ్చి హీరోగా మారాడు. ‘హలో’సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అఖిల్ పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించాడు. కానీ 2023లో ఆయన నటించిన ‘ఏజెంట్’(Agent)భారీ డిజాస్టర్‌గా నిలువడంతో అఖిల్ ఫేమ్‌పై తీవ్ర ప్రభావం పడింది. స్టార్ హీరో నాగార్జున(Nagarjuna) కొడుకు అయినప్పటికీ పెద్దగా ఫేమ్ సంపాదించుకోలేకపోయాడు. ఇక ‘ఏజెంట్’తర్వాత రెండేళ్లపాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నాడు. ప్రస్తుతం ‘లెనిన్’(Lenin) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మురళీ కృష్ణ అబ్బూర్(Murali Krishna Abbur) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.

అయితే ఇందులో అఖిల్ సరసన క్రేజీ బ్యూటీ శ్రీలీల (Sreeleela)హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇదిలా ఉంటే.. తాజాగా, ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అక్కినేని అభిమానుల ఆనందానికి కారణం అవుతుంది. అఖిల్ ‘లెనిన్’విడుదల కాకముందే మరో రొమాంటిక్ సినిమాతో రాబోతున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాలో టాలీవుడ్ యంగ్ బ్యూటీ కృతి శెట్టి(Kriti Shetty) హీరోయిన్‌గా నటిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇది రొమాంటిక్ చిత్రంగా రాబోతుండగా.. కొత్త డైరెక్టర్ నందు దర్శకత్వం వహించనున్నట్లు టాక్. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అది చూసిన వారు ఈ కాంబో అస్సలు ఊహించలేదని అంటున్నారు. అఖిల్ పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. ఇటీవల నాగార్జున అఖిల్, జైనబ్‌ల నిశ్చితార్థం జరిపించిన విషయం తెలిసిందే. కుటుంబ సభ్యుల మధ్య జరిగిన ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు షేర్ చేస్తూ నాగార్జున అధికారిక ప్రకటన చేశారు. అయితే వీరి పెళ్లి డేట్ మాత్రం అనౌన్స్ చేయలేదు. దీంతో అంతా అఖిల్ పెళ్లి గురించి వెయిట్ చేస్తున్నారు.

Next Story

Most Viewed