- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
బెంగళూరులో ఎయిర్ ఇండియాపై డేవిడ్ వార్నర్ ఆగ్రహం.. ఎందుకంటే?

దిశ, వెబ్‌డెస్క్: బెంగళూరులో ఎయిర్ ఇండియా (Air India)పై డేవిడ్ వార్నర్ (David Warner) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎయిర్ ఇండియా పేలవమైన సేవల గురించి వార్నర్ X (గతంలో ట్విట్టర్) ద్వారా ఫిర్యాదు చేశారు. ఎయిర్‌లైన్ తనను "పైలట్ లేకుండా" విమానం ఎక్కించి గంటల తరబడి విమానంలో వేచి ఉండమని బలవంతం చేశారని వార్నర్ ఆరోపించారు. విమానానికి పైలట్లు లేరని తెలిసి కూడా ప్రయాణీకులను ఎందుకు విమానం ఎక్కించుకుంటారని వార్నర్ (Warner) తన ట్వీట్‌లో ప్రశ్నించారు. కాగా దీనిపై ఎయిర్ ఇండియాపై ఎటువంటి స్పందన ఇవ్వలేదు. ఇదిలా ఉంటే డైనమిక్ ఆస్ట్రేలియన్ క్రికెటర్ (Dynamic Australian cricketer) అయిన వార్నర్‌కు భారత దేశంలో లక్షలాది అభిమానులు ఉన్నారు.
ముఖ్యంగా ఆయన ఐపీఎల్ (IPL)లో హైదరాబాద్, ఢిల్లీ తరుఫున ఆడటంతో ఆ ప్రాంతాల ప్రజలు అతన్ని ఎంతగానో ఆదరిస్తుంటారు. మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే వార్నర్.. టాలీవుడ్ లో హిట్ కొట్టిన ప్రతి సినిమా పాటలు, లేదా డైలాగ్‌లను మరింత ఫేమస్ చేస్తుంటాడు. ఈ క్రమంలో అతనికి ఉన్న క్రేజ్‌ను ఉపయోగించుకోవడానికి.. టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ (Nithin) హీరోగా వస్తున్న "రాబిన్‌హుడ్" సినిమా ("RobinHood" movie) లో అతిధి పాత్రతో తెలుగు సినిమాలోకి అడుగుపెట్టబోతున్నాడు. ఈ క్రమంలోనే వార్నర్ ఈ రోజు హైదరాబాద్ వేదికగా జరిగే రాబిన్ హుడ్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొనడానికి బెంగళూరు నుంచి హైదరాబాద్ బయలు దేరారు. ఈ క్రమంలో అతన్ని ఎయిర్ ఇండియా విమానంలో ఎక్కించి వేయిట్ చేయించినందుకు వార్నర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది.