- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిఖిల్ బాటలో.. నితిన్
కరోనా తెలుగు హీరోల ఆశల్ని అడియాశలు చేసింది. ఫిబ్రవరిలో ఎంగేజ్‌మెంట్, ఏప్రిల్‌లో పెళ్లి అని లెక్కలేసుకున్న హీరోలకు భారీ షాక్ ఇచ్చింది. చేసేదేమీ లేక కొన్ని నెలలు పెళ్లి వాయిదా వేసుకున్న నిఖిల్.. ఆ తర్వాత మరీ లేట్ అయితే బాగోదనుకుని, చాలా కొద్ది మంది ఆప్తుల మధ్య పెళ్లి చేసేసుకున్నాడు. కానీ పాపం నితిన్ మాత్రం మంచి సమయం కోసం కాస్త ఎక్కువగానే వెయిట్ చేస్తూ ఉన్నాడు. రానా మాత్రం ఈ లాక్‌డౌన్ గ్యాప్‌లోనే తన పని కానిచ్చేశాడు. నచ్చిన అమ్మాయి గురించి ఇంట, నెట్టింట చెప్పేసి ఆగస్ట్‌లో పెళ్లికి సిద్ధమైపోయాడు.
దీంతో రియలైజ్ అయిన నితిన్.. కరోనా కాలం పోయేదాకా వెయిట్ చేసి పెళ్లి చేసుకోవడమంటే మామూలు విషయం కాదేమో అనుకుని తను కూడా పెళ్లి పీటలెక్కేందుకు రెడీ అయ్యాడట. నెక్స్ట్ మంత్ అంటే జులైలో హైదరాబాద్‌లోని ఓ ఫామ్ హౌస్‌లో షాలిని మెడలో మూడు ముళ్లు వేసి ఒక్కటవ్వాలని నిర్ణయించుకున్నాడట. అతి కొద్ది మంది ఆప్తుల నడుమ ఈ వివాహ మహోత్సవం జరగనుందట.