నీతా అంబానీకి అరుదైన గౌరవం!

by Harish |
నీతా అంబానీకి అరుదైన గౌరవం!
X

దిశ, సెంట్రల్ డెస్క్: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత సతీమణి నీతా అంబానీ అనేక సేవా కార్యక్రమాలను చేస్తుంటారు. ఈ క్రమంలోనే నీతా అంబానీకి అరుదైన గౌరవం లభించింది. అమెరికాలోని ప్రముఖ మేగజైన్ టౌన్ అండ్ కంట్రీ విడుదల చేసిన టాప్ గ్లోబల్ ఫిలాంత్రఫిస్ట్స్-2020 జాబితాలో నీతా అంబానీకి చోటు కల్పించారు. ఆమెతో పాటు టిమ్ కుక్, ఓప్రా విన్‌ఫ్రే, లారిన్ పావెల్ జాబ్స్, మైఖేల్ బ్లూంబర్గ్, లియనార్డో డికాప్రియో వంటి ప్రముఖులు జాబితాలో ఉన్నారు. ఇండియా నుంచి ఈ జాబితాలో నీతా ఒక్కరికే స్థానం దక్కడం విశేషం. ప్రపంచం కరోనా కష్టాల్లో సమయంలో వీరందరూ అనేక సేవా కార్యక్రమాలను నిర్వహించారని టౌన్ అండ్ కంట్రీ మేగజైన్ తెలిపింది. ఇండియాలో రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా నీతా అంబాానీ ఎంతోమందికి దానధర్మాలు చేశారు. పీఎం కేర్స్‌తో పాటు సీఎం రిలీఫ్ ఫండ్స్‌కు పెద్ద మొత్తాల్లో విరాళాలు ఇచ్చారు. ఇటీవల దేశంలోనే తొలి కోవిడ్ ఆస్పత్రిని ముంబైలో నిర్మించారు. ఎంతో మంది పేదల ఆకలిని తీర్చారు. వైద్యులు, వైద్య సిబ్బందికి పీపీఈ కిట్లు, ఎన్ 95 మాస్క్‌లు సరఫరా చేశారు. ఇక, టౌన్ అండ్ కంట్రీ మేగజైన్ అమెరికాలో లీడింగ్ లైఫ్ స్టైల్ మ్యాగజైన్. 1846 నుంచి ఇప్పటివరకు నిరాటంకంగా కొనసాగుతోంది. ఈ మేగజైన్‌లో సమాజ సేవ చేసే వారిని గుర్తించి వారికి తగిన గౌరవం అందిస్తుంటుంది.

Advertisement

Next Story