ప్రజలు సామూహిక దూరం పాటించాలి

by Aamani |
ప్రజలు సామూహిక దూరం పాటించాలి
X

దిశ, ఆదిలాబాద్: కరోనా వైరస్ రాకుండా ప్రజలంతా సామూహిక దూరం పాటించాలని నిర్మల్ కలెక్టర్ ముషరఫ్ ఫారూఖీ కోరారు. నిర్మల్ పట్టణంలో బైల్ బజార్లో‌లోని కూరగాయల మార్కెట్ యార్డును సోమవారం సందర్శించారు. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో పట్టణ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కూరగాయల మార్కెట్‌లో వినియోగదారులు సామాజిక దూరం పాటించాలని కోరారు. పోలీసులు ఈ విషయంలో చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ శశిధర్ రాజు, జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, నిర్మల్ మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ పాల్గొన్నారు.

Tags: Nirmal collector,Mushrraf pharukhi,visit,vegetabale market

Advertisement

Next Story