- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇంటర్నేషనల్ కోర్టుకు నిర్భయ దోషులు
న్యూఢిల్లీ: నిర్భయ కేసులోని ముగ్గురు దోషులు అక్షయ్ సింగ్, పవన్ గుప్తా, వినయ్ శర్మలు.. ఉరిశిక్షపై స్టే విధించాలని కోరుతూ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సోమవారం నాలుగో దోషి ముఖేష్ సింగ్ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ తిరస్కరణకు గురైంది. గతంలో తన తరఫున వాదించిన న్యాయవాది తనను తప్పుదారి పట్టించారని, కాబట్టి తనకున్న న్యాయపరమైన అవకాశాలన్నీ తిరిగి కల్పించాలని సుప్రీంకోర్టును కోరుతూ పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఈ నెల 5న ట్రయల్ కోర్టు ఈ కేసులోని నలుగురు దోషులకు మార్చి 20వ తేదీ ఉదయం 5.30 నిమిషాలకు ఉరిశిక్ష అమలు చేయాలని డెత్ వారెంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే.
కాగా, శుక్రవారం ఈ నలుగురికి ఉరిశిక్ష అమలు కానున్న తరుణంలో దోషుల తల్లిదండ్రులు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు లేఖ రాశారు. తమ మనవిని స్వీకరించి కారుణ్య మరణానికి అనుమతివ్వాలని రాష్ట్రపతిని కోరడం గమనార్హం.
Tags : Nirbhaya Convicts, Nirbhaya Case, Death penalty Stay