'ఆనంద్‌పై మోసం చేసి గెలిచినందుకు క్షమాపణలు'

by Shiva |
ఆనంద్‌పై మోసం చేసి గెలిచినందుకు క్షమాపణలు
X

దిశ, స్పోర్ట్స్: కోవిడ్ – 19 రిలీఫ్ వర్క్ ఫండ్ రైజింగ్‌లో భాగంగా అక్షయ పాత్ర సంస్థ చెస్ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్‌తో ఒక చారిటీ పోటీ నిర్వహించింది. ఈ పోటీల్లో చాలా మంది సెలెబ్రిటీలు పాల్గొన్నారు. జిరోధా సంస్థ యజమాని నిఖిల్ కామత్ కూడా ఈ పోటీలో పాల్గొని విశ్వనాథన్ ఆనంద్‌ను ఓడించారు. అయితే నిఖిల్ మోసం చేసి గెలిచినట్లు వార్తలు రావడంతో ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్ విచారం వ్యక్తం చేసింది. కాగా ఈ విషయంపై నిఖిల్ కూడా ట్విట్టర్ వేదికగా స్పందించారు.

‘నేను చిన్నప్పటి నుంచి ఆనంద్‌తో ఆడాలని కలలు కన్నాను. అది ఆదివారం నాడు నిజమైంది. నేను నిజంగానే విశ్వనాథన్ ఆనంద్‌ను ఓడించానని అందరూ భావిస్తున్నారు. అది తప్పు. నేను కొంత మంది వ్యక్తులు, కంప్యూటర్ సహాయంతో గెలిచాను. పొద్దున్నే లేచి నిద్రమొహంతో ఉసేన్ బోల్ట్‌తో పరుగెత్తి గెలిచానంటే ఎవరైనా నమ్ముతారా. ఈ గెలుపు కూడా అంతే’ అని ట్వీట్ చేశాడు. మరోవైపు ఆనంద్ కూడా ట్విట్టర్‌లో స్పందించారు. ఈ కార్యక్రమం కేవలం చారిటీ కోసం చేసిందే. ప్రజల నుంచి విరాళాలు సేకరించడానికి నిజంగా ఆట ఆడటం సంతోషాన్ని ఇచ్చింది. ఆటలో ఇతరులు కూడా నిజాయితీగా ఆడాలని అనుకున్నాను’ అని ట్వీట్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed