ఆందోళన చేసి.. షర్మిలను కలిసి..

by Shyam |
ఆందోళన చేసి.. షర్మిలను కలిసి..
X

దిశ, తెలంగాణ బ్యూరో: లోటస్ పాండ్‌లో షర్మిలను కలిసి తమ సమస్యలను చెప్పుకునేందుకు వచ్చిన నిజాం కాలేజీ విద్యార్థులను అక్కడి సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఉదయం 8 గంటలకు లోటస్ పాండ్‌కు వచ్చామని ఏఐఎస్ఎఫ్ నాయకులు చెప్పారు. మధ్యాహ్నం 2.30 గంటల వరకు వెయిట్ చేసినా కలవనివ్వకపోవడంతో ఆందోళనకు దిగినట్టు తెలిపారు.

దీంతో సిబ్బంది వచ్చి సమస్య తెలుసుకొని షర్మిల వద్దకు తీసుకెళ్లినట్టు వెల్లడించారు. ఈ సందర్భంగా షర్మిల వారితో మాట్లాడుతూ.. త్వరలో రాష్ట్రానికి మంచి రోజులు రాబోతున్నాయని, ఎవరూ అధైర్య పడొద్దని అభయమిచ్చారు. అనంతరం ఏఐఎస్ఎఫ్ నాయకులు తమ సమస్యలపై వినతి పత్రం అందజేశారు. సేవ్ ఉస్మానియా పేరిట ప్రతి ఏడాది నిర్వహించే కార్యక్రమానికి తప్పకుండా హాజరుకావాలని కోరారు.

ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ నాయకుడు శివారెడ్డి మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం తమ సమస్యలను పట్టించుకోలేదని, ఈ విషయాన్ని షర్మిల దృష్టికి తీసుకెళ్ళినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా ఆదివాసీ ఉద్యోగ సంఘాల నేతలు, ప్రొఫెసర్లు, మహిళా సంఘాల నేతలు, విద్యార్థి సంఘాల ప్రతినిధులు కూడా షర్మిలను కలిసి తమ సమస్యలను ఆమె దృష్టికి తీసుకెళ్లారు. పార్టీకి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని పేర్కొన్నారు. షర్మిలను కలిసిన వారిలో ఆధార్ సొసైటీ జనరల్ సెక్రటరీ మెట్ల పాపయ్య, ఆదివాసీ ఉద్యోగుల సంక్షేమ, సాంస్కృతిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గొంది వెంకటరమణ, ఓయూ ప్రొఫెసర్ కిశోర్ కుమార్, ఆదివాసీ స్టూడెంట్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు బట్ట వెంకటేశ్వర్లు, ఆదివాసీ మహిళా చైతన్య శక్తి అధ్యక్షురాలు వెంకటలక్ష్మి తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed