- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బిగ్ బ్రేకింగ్: తెలంగాణలో నైట్ కర్ఫ్యూ పొడగింపు
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ మే నెల 8వ తేదీ తెల్లవారుజామున 5 గంటల వరకు కొనసాగనుంది. అప్పటివరకు ప్రతీ రోజు రాత్రి 9.00 గంటల నుంచి మే 8వ తేదీ తెల్లవారు జాము 5.00 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమలులో ఉంటుంది. దుకాణాలన్నీ రాత్రి 8.00 గంటలకే మూసేయాల్సి ఉంటుంది. ఏప్రిల్ మూడవ వారంలో ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా నైట్ కర్ఫ్యూ గడువు శనివారం తెల్లవారుజామున 5 గంటలకు ముగుస్తోంది. అయితే దీన్ని పొడిగించడంపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోవడంతో హైకోర్టు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది.
నైట్ కర్ఫ్యూ పొడిగింపుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందా లేక హైకోర్టే నిర్ణయాన్ని ప్రకటించాలా అని అడ్వొకేట్ జనరల్‌ను నిలదీసింది. నిర్ణయాన్ని వెలువరించడానికి 45 నిమిషాల డెడ్‌లైన్ విధించింది. దీంతో ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆగమేఘాల మీద నైట్ కర్ఫ్యూను మే నెల 8వ తేదీ తెల్లవారు జామున 5.00 గంటల వరకు పొడిగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇది వర్తించనున్నందున అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు అమలు చేయాలని సీఎస్ ఆ ఉత్తర్వుల్లో ఆదేశించారు.