వరవరరావు అల్లుళ్లకు ఎన్ఐఏ నోటీసులు

by Anukaran |   ( Updated:2020-09-07 09:43:55.0  )
వరవరరావు అల్లుళ్లకు ఎన్ఐఏ నోటీసులు
X

దిశ, క్రైమ్‌బ్యూరో: బీమా కోరెగావ్ కేసులో అరెస్టైన వరవరరావు అల్లుళ్లు కె. సత్యనారాయణ, కేవీ కుమర్నాథ్‌కు ఎన్ఐఏ నోటీసులు జారీ చేసింది. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ బీమా కోరెగావ్‌ కేసుతో తమకు సంబంధం లేకున్నా.. వరవరావుకు వ్యతిరేకంగా సాక్ష్యాలను సేకరించేందుకే నోటీసులు ఇచ్చారని తెలిపారు. వరవరరావు ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించిందని, అంతేగాక ముంబైలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో విచారణకు రావాలని తమకు సీఆర్పీసీ 160సెక్షన్ కింద నోటీసులు ఇవ్వడం బాధ కలిగిస్తుందన్నారు. ప్రభుత్వ చర్యల వల్ల వచ్చే అసమ్మతిని అరికట్టడానికే దేశంలో మేధావుల గొంతు నొక్కి అరెస్ట్ చేస్తున్నారని పేర్కొన్నారు.

Advertisement

Next Story