కేరళ గోల్డ్ స్కాంలో హైదరాబాద్ పాత్ర

by Anukaran |   ( Updated:2020-07-19 05:26:52.0  )
కేరళ గోల్డ్ స్కాంలో హైదరాబాద్ పాత్ర
X

దిశ, వెబ్ డెస్క్: కేరళ గోల్డ్ స్కాం కేసులో హైదరాబాద్ కు ఉన్న లింకులపై NIA అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. నగదు చెల్లింపులు హైదరాబాద్ నుంచే జరిగినట్లు వారు అనుమానిస్తున్నారు. గోల్డ్ స్మగ్లింగ్ విషయంలో హవాలా డబ్బును నగరం నుంచి దుబాయ్‌కు ట్రాన్స్ ఫర్ చేసినట్లు పలు ఆధారాలు లభించినట్లు సమాచారం. ఈ కేసులో ఇప్పటికే ప్రధాన నిందితులు స్వప్న సురేశ్ అండ్ సందీప్ నాయర్‌ను పోలీసులు అరెస్టు చేయగా, మరో నిందితుడు యూఏఈ కాన్సులేట్ గన్ మెన్ రెండ్రోజుల కిందట ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన విషయం విదితమే. ఇదిలాఉండగా, ఈ నెల 6వ తేదీన దుబాయ్ నుంచి చార్టర్ విమానంలో 30కిలోల బంగారాన్ని కేరళకు తరలించారు. కస్టమ్స్ తనిఖీల్లో భాగంగా ఏయిర్‌పోర్టు అధికారులు బంగారాన్ని పట్టుకున్నారు.ఈ కేసులో చాలా మంది హస్తమున్నట్లు పలు కథనాలు కూడా వెలువడుతున్నాయి. అయితే, NIA అధికారులు ఇప్పటికే ప్రధాన నిందితులతో పాటు పలువురి అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే బంగారం నగదు చెల్లింపుల వ్యవహారం పై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story