- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేంద్ర పర్యావరణ శాఖకు ఎన్జీటీ వార్నింగ్
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు వ్యవహారంలో కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ నిర్లక్ష్యంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చెన్నై బెంచ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. గత విచారణ సందర్భంగా ఇచ్చిన ఆదేశం మేరకు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయకపోవడం పై ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈ నెల 24వ తేదీకల్లా కౌంటర్‌ను దాఖలు చేయాల్సిందేనని, లేదంటే పది వేల రూపాయల జరిమానా విధిస్తామని హెచ్చరించింది. తరచూ వాయిదాలు కోరుతున్న కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వశాఖ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తదుపరి విచారణను జనవరి 6వ తేదీకి వాయిదా వేసింది.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం కోసం సంప్రదాయక చెరువుల్లో మట్టిని తవ్వుతున్నారని, పర్యావరణానికి విఘాతం కలుగుతున్నదంటూ జడ్చర్లకు చెందిన కోసిగి వెంకటయ్య ఇటీవల గ్రీన్ ట్రిబ్యునల్‌లో పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని సోమవారం విచారించిన ఎన్జీటీ చెన్నై బెంచ్ కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖకు వార్నింగ్ ఇచ్చింది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ నుంచి ఎలాంటి ఎన్విరాన్‌మెంటల్ క్లియరెన్సు రాలేదని, అయినా నిర్మాణం జరగడంతో పాటు పర్యావరణానికి విఘాతం కలిగించే చర్యలు చేపడుతున్నదని పిటిషనర్ పేర్కొన్నారు.
సుమారు 210 చెరువుల నుంచి లెక్కకు మించి మట్టిని తవ్వినట్లు ఎన్జీటీ దృష్టికి తీసుకెళ్ళారు. చెరువుల్లోని మట్టిని తవ్వడంలో తప్పు లేదని, కానీ ముంపు ప్రాంతాల్లో మాత్రం మట్టిని తవ్వడం పర్యావరణ నిబంధనలకు విరుద్ధమంటూ జాయింట్ కమిటీ ఒక నివేదికలో పేర్కొన్న విషయాన్ని పిటిషనర్ గుర్తుచేశారు. కమిటీ అసమగ్రంగా, గందరగోళ నివేదిక ఇచ్చిందని పేర్కొన్నారు. పర్యావరణ శాఖ క్షేత్రస్థాయిలోని వాస్తవ పరిస్థితులను గ్రహించి పర్యావరణానికి జరుగుతున్న విఘాతం, నిబంధనల ఉల్లంఘనలపై చర్యలు తీసుకోకుండా తగిన ఆదేశాలు ఇవ్వాలంటూ ఎన్జీటీని కోరడం విడ్డూరంగా ఉందని పిటిషనర్ వాదించారు. వీటిని పరిగణనలోకి తీసుకున్న ఎన్జీటీ కేంద్ర పర్యావరణ శాఖను హెచ్చరించి తదుపరి విచారణను జనవరి 6వ తేదీకి వాయిదా వేసింది.
- Tags
- fine