- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
కొనసాగనున్న సీఎస్కే కష్టాలు.. నెక్ట్స్ మ్యాచ్‌కు వారిద్దరు దూరం

దిశ, స్పోర్ట్స్: ఢిల్లీతో జరిగిన తొలి మ్యాచ్‌లో భారీ స్కోర్ చేసినా చెన్నై జట్టు దాన్ని కాపాడుకోలేకపోయింది. చెన్నై బౌలింగ్ దళంలో పేసర్లు లేని లోటు స్పష్టంగా కన్పించింది. పేస్ విభాగంలో లుంగి ఎన్‌గిడి, జాసన్ బెర్హెండాఫ్ ఇంకా జట్టుతో చేరకపోవడంతో బౌలింగ్ విభాగం బలహీనంగా మారింది. కాగా, దక్షిణాఫ్రికాకు చెందిన లుంగి ఎన్‌గిడి ఇండియాకు ఆలస్యంగా చేరుకోవడంతో ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్నాడు.
మరోవైపు చివరి నిమిషంలో జట్టుతో ఒప్పందం కుదుర్చుకున్న ఆసీస్ బౌలర్ జాసన్ బెర్హెండాఫ్ కూడా ఐసోలేషన్‌లో ఉన్నాడు. వీరిద్దరూ ఏప్రిల్ 16న పంజాబ్ కింగ్స్‌తో జరిగే మ్యాచ్‌కు అందుబాటులో ఉండరని సీఎస్కే కోచ్ స్టీఫెన్ ఫ్లెమ్మింగ్ వెల్లడించాడు. తర్వాతి మ్యాచ్‌కి కూడా తుది జట్టులో పెద్దగా మార్పులు ఉండవని కోచ్ చెబుతున్నాడు. వాంఖడే స్టేడియం బ్యాట్స్‌మెన్‌కు అనుకూలంగా ఉండటంతో పాటు మంచు ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల ఓటమి చెందినట్లు ఫ్లెమ్మింగ్ వివరించాడు.