- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ICC టోర్నీల్లో భారత్ పై ఆధిపత్యం చెలాయించిన న్యూజిలాండ్..!
దిశ, వెబ్‌డెస్క్ : ఐసీసీ టీ-20 వరల్డ్ కప్‌లో హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన టీమ్ ఇండియా తొలి మ్యాచ్‌లోనే పాకిస్తాన్‌పై ఘోరంగా ఓడిపోయి సెమీస్ అవకాశాలను సంక్లిష్టంగా మార్చుకుంది. ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్‌లో టీం ఇండియా తప్పకుండా విజయం సాధించాలి. అప్పుడే మనకు సెమీస్ చేరుకునే అవకాశాలు మెండుగా ఉంటాయి.అయితే, ఐసీసీ టోర్నీల్లో ఇప్పటివరకు భారత జట్టుపై న్యూజిలాండ్ దే ఆధిపత్యం కొనసాగింది. నాకౌట్ మ్యాచుల్లోనూ ఇండియాను కివీస్ చాలాసార్లు ఓడించింది. 2000 సంవత్సరంలో ఐసీసీ నాకౌట్ సిరీస్ మ్యాచ్‌లో భారత్ తప్పక గెలవాల్సిన ఉండగా.. ఆనాడు న్యూజిలాండ్ ఆటగాళ్లు ఇండియాకు తొలిసారి షాకిచ్చారు.
2007లో జరిగిన తొలి టీ20 వరల్డ్ కప్‌లో భారత్ విజేతగా నిలిచినా, లీగ్ దశలో మాత్రం కివీస్ చేతిలో ఓడింది. 2016 టీ-20 వరల్డ్ కప్‌లో కూడా లీగ్ దశలో కివీస్‌తో తలపడ్డ భారత్ దారుణమైన ఆటతీరు కనబరిచి ఘోర పరాజయాన్ని మూట గట్టుకుంది. ఇకపోతే 2019 వన్డే వరల్డ్ కప్ సెమీస్‌ను ఇంకా ఎవరూ మర్చిపోలేరు. లక్ష్య ఛేదనలో టీం ఇండియా టాప్ ఆర్డర్ దారుణంగా విఫలమైంది. వచ్చిన ఆటగాళ్లు వచ్చినట్టే వెనుదిరిగారు. చివరివరకు రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని ఇండియాను గెలిపించేందుకు ప్రయత్నించినా.. ధోని రన్ ఔట్ కావడంతో ఆశలు గల్లంతయ్యాయి. ఇక తాజాగా జరిగిన ఐసీసీ టెస్టు చాంపియన్‌షిప్‌లో కూడా భారత జట్టు ఓడిపోయింది. టీమ్ ఇండియాతో జరిగిన ఫైనల్‌లో కివీస్ జట్టు 8 వికెట్ల తేడాతో విజయం సాధించి తొలి ప్రపంచ టెస్టు చాంపియన్‌గా నిలిచింది.