హిందూ ఆలయంలో న్యూజిలాండ్ ప్రధాని

by vinod kumar |   ( Updated:2020-08-09 09:18:17.0  )
హిందూ ఆలయంలో న్యూజిలాండ్ ప్రధాని
X

కరోనాను కట్టడి చేయడంలో న్యూజిలాండ్ విజయం సాధించిందని ఆ దేశ ప్రధాని జసిందా ఆర్డెర్న్ మీడియా కాన్ఫరెన్స్ లో వెల్లడించారు. 100 రోజులుగా తమ దేశంలో స్థానికంగా ఒక్క కేసు కూడా నమోదవలేదని తెలిపారు. కార్యక్రమం అనంతరం ఆమె హిందూ దేవాలయాన్ని దర్శించి, అక్కడే భోజనం చేసారు.

ఆక్లాండ్ లోని రాధాకృష్ణుని ఆలయ దర్శనానికి వెళ్లిన ఆమె గుడి బయటే బూట్లు విడిచి లోనికి వెళ్లారు. నుదుట తిలకం ధరించారు. హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ నిర్వాహకులు ఆమెను శేషవస్త్రంతో సత్కరించారు. అనంతరం అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పూరీ, చోలే మాసాలాతో భోజనం కూడా చేసారు. కొద్దిసేపు అక్కడి ముచ్చటించిన తర్వాత ఆమె తిరిగి పయనమయ్యారు. కాగా ఈ వీడియోను నెటిజెన్లు విపరీతంగా షేర్లు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed