న్యూజీలాండ్ జట్టుపై ఫిర్యాదు చేయనున్న బీసీసీఐ

by Shyam |   ( Updated:2021-06-15 11:09:38.0  )
న్యూజీలాండ్ జట్టుపై ఫిర్యాదు చేయనున్న బీసీసీఐ
X

దిశ, స్పోర్ట్స్: డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ ఆడటానికి ఇండియా, న్యూజీలాండ్ జట్లు ప్రస్తుతం సౌతాంప్టన్‌లోని హోటల్‌లొ బస చేస్తున్నాయి. కఠినమైన బయోబబుల్ నిబంధనల నడుమ ఇరు జట్లలోని క్రికెటర్లు బయటకు వెళ్లకుండా పక్కనే ఉన్న స్టేడియంలో సాధన చేస్తున్నారు. అయితే న్యూజీలాండ్ జట్టులోని ఆరుగురు క్రికెటర్లు బయోబబుల్ నిబంధనలు ఉల్లంఘించి బయటకు వెళ్లినట్లు తెలుస్తున్నది. ఆ ఆరుగురిపై ఐసీసీకి బీసీసీఐ పిర్యాదు చేయనున్నట్లు సమాచారం. మంగళవారం ఉదయం ట్రెంట్ బౌల్ట్, టిమ్ సౌథీ, హెన్రీ నికొలస్, మిచెల్ సాంట్నర్, డారిల్ మిచెల్‌తో పాటు ఫిజియో టామీ సిమ్‌సెక్ నిబంధనలు ఉల్లంఘించి ఎక్స్‌కర్షన్‌కు వెళ్లారు.

ఈ విషయం తెలిసిన వెంటనే టీమ్ ఇండియా యాజమాన్యం బీసీసీఐకి చేరవేసింది. కఠినమైన బయోబబుల్‌ను వదిలి బయటకు వెళ్లడం ద్వారా ఇతర క్రికెటర్లకు ప్రమాదం కలిగించేలా ప్రవర్తించారని.. వీరిపై చర్యలు తీసుకోవాలని బీసీసీఐ కోరనున్నట్లు సమాచారం. కివీస్ క్రికెటర్లు సౌతాంప్టన్‌లోని గోల్ఫ్ కోర్సుకు వెళ్లారని.. అది బయోబబుల్ అవతల ఉన్నట్లు తెలుస్తున్నది.

Advertisement

Next Story