- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వాహనదారులకు గుడ్ న్యూస్.. ఇక ట్రాఫిక్ కష్టాలకు చెక్
దిశ, సిటీ బ్యూరో: మహానగరంలో రోజురోజుకి పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్య నివారణలో భాగంగా ఆధునిక కెనడా ట్రాఫిక్ సిగ్నల్స్ ను అందుబాటులోకి తేనుంది బల్దియా. ప్రస్తుతం మహానగరంలోని వివిధ ట్రాఫిక్ జంక్షన్లలో పని చేస్తున్న భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బెల్)కు చెందిన 237 సిగ్నల్స్ తరుచూ మోరాయించటం, వీటి మరమ్మతులకు కావాల్సిన స్పేర్స్ ను బెల్ సంస్థ సకాలంలో బల్దియాకు అందజేయకపోవటంతో ఆధునిక సిగ్నల్స్ ను అందుబాటులోకి తేవాలని జీహెచ్ఎంసీ భావిస్తుంది. దశల వారీగా బెల్ సిసిగ్నల్స్ కు స్వస్తి పలికి ప్రత్యామ్నాయం చూసుకోవాలన్న ఆలోచనలో బల్దియా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం నగరంలోని వీఐపీ జోన్లలో కూడా అస్తవ్యస్తంగా మారిన సిగ్నలింగ్ వ్యవస్థకు చెక్ పెట్టి శాశ్వత ప్రాతిపదికన పరిష్కారాన్ని సమకూర్చాలని జీహెచ్ఎంసీ భావిస్తుంది.
ఇందుకు గాను కెనడాకు చెందిన ఐబీఐ గ్రూప్ కు చెందిన అడాప్టివ్ ట్రాఫిక్ సిగ్నలింగ్ కంట్రోల్ (ఏటీఎస్ సీ) విధానంతో పని చేయనున్న సిగ్నల్స్ ను ఏర్పాటు చేయాలని చూస్తోంది. సిగ్నల్స్ వద్ద ఆగి ఉన్న వాహానాల సంఖ్యను సింక్రనైజేషన్ చేసుకునేలా వీటిని తయారు చేశారు. తొలి దశగా 150 రద్దీ కూడళ్లలో వీటిని ఏర్పాటు చేయాలని బల్దియా అధికారులు భావిస్తున్నారు. వీటి నిర్వహణ బాధ్యతలను
కూడా తొలి మూడేళ్ల పాటు కెనడాకు చెందిన ఐబీఐ సంస్థకే అప్పగించనున్నట్లు చీఫ్ ఇంజనీర్ మాడపాటి దేవానంద్ తెలిపారు. వీటి ఏర్పాటు పనులు చురుకుగా సాగుతున్నాయని, మరో రెండు నెలల్లో ఇవి అందుబాటులోకి రానున్నట్లు సమాచారం.
సిగ్నల్ సింక్రనైజేషన్ అంటే?
సిగ్నల్ సింక్రనైజేషన్ అంటే ఏమిటీ? అన్న ప్రశ్న మహానగరవాసుల్లో తలెత్తవచ్చు. సింక్రనైజేషన్ అంటే అమెరికా వంటి అభివృద్ది చెందిన దేశాల్లో జంక్షన్లలో ఏర్పాటు చేసే సిగ్నల్స్ వద్ద రెడ్ సిగ్నల్ పడినప్పుడు.. మరోవైపు నుంచి జంక్షన్ దాటుతున్న వాహానాల సంఖ్యను, రెడ్ సిగ్నల్ కారణంగా ఆగిన వాహానాల సంఖ్యను సైతం గుర్తించి, జంక్షన్ దాటి వెళ్లిన వాహానాలన్నీ తదుపరి సిగ్నల్ వద్ద మళ్లీ
ముందుకు కదులుతున్నపుడు ఇక్కడి ట్రాఫిక్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేలా ఆటోమెటిక్ గా టైమ్ సెట్ చేసుకోవటమే సింక్రనైజేషన్. ప్రస్తుతం నగరంలో వినియోగిస్తున్న సిగ్నల్స్ ముందుగానే టైమ్ సెట్ చేసి పెట్టినవి. అందుకే ఒక వైపు నుంచి ఎలాంటి ట్రాఫిక్ రాకున్నా.. గ్రీన్ సిగ్నల్ వెలుగుతుండటంతో, మరోవైపు నుంచి వందలాది వాహానాలు ముందుకెళ్లాల్సి ఉన్నా, రెడ్ సిగ్నల్ పడటం వంటి
లోపాలు తలెత్తుతున్నాయి. ఈ ఆధునిక సిగ్నల్స్ అందుబాటులోకి వస్తే ట్రాఫిక్ లేకున్నా, మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు సిగ్నల్స్ వద్ద నిరీక్షించే అవసరం లేకుండా పోతుంది.
పాదచారుల కోసం వంద పెలికాన్ సిగ్నల్స్
రోజురోజుకి పెరిగిపోతున్న ట్రాఫిక్ ను క్రమబద్దీకరించేందుకు రోడ్ డివైడర్లు పెరిగిపోవటం, పాదచారులు రోడ్డు దాటేందుకు అవసరమైన జీబ్రా క్రాసింగ్ లు తగ్గటం వంటి సమస్యలను అధిగమించి పాదచారులు సురక్షితంగా రోడ్డు దాటేందుకు వీలుగా వంద పెలికాన్ సిగ్నల్స్ ను కూడా ఏర్పాటు చేయనున్నారు. రోడ్డు దాటాలనుకునే పాదచారి నేరుగా ఆపరేట్ చేసుకునేందుకు వీలుగా వీటిని ఏర్పాటు చేయనున్నారు. వీటిని ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో పాదచారులకు తెలిసేలా ప్రత్యేకంగా బోర్డులను కూడా అందుబాటులో ఉంచనున్నారు.