- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
లక్షలు తెచ్చిపెడుతున్న ‘పాదాల ఫొటోలు’
దిశ, వెబ్‌డెస్క్ : ప్రతి ఒక్కరూ తమ కాళ్ల మీద తామే నిలబడాలనుకుంటారు. తాము సంపాదించిన డబ్బుతో హాయిగా కాలు మీద కాలేసుకుని బతికేందుకు ఎన్నో పాట్లు పడుతుంటారు. అయితే ఎటువంటి శ్రమ లేకుండా లక్షలకు లక్షల డబ్బు సంపాదిస్తే.. ఆ కిక్కే వేరు కదా. మరి ఊరికే కాలు మీద కాలేసుకుని ఎలా సంపాదిస్తారు? అనేగా మీ డౌట్. చాలా సింపుల్! ఈ టెక్ ఎరాలో.. వాయిస్‌ను అమ్ముకోవచ్చు, పెయింటింగ్‌ను వేలం వేయొచ్చు, కవితకు ప్రైస్ ట్యాగ్ వేయొచ్చు. ఇలా సోషల్ మీడియాను సరిగ్గా ఉపయోగించుకుంటే కూర్చున్న చోటే కోటీశ్వరులు అయిపోవచ్చు. ఇప్పటికే ఈ విషయాన్ని ఎంతోమంది యూట్యూబర్స్, వ్లోగర్స్, అఫిలియేట్ మార్కెటర్స్ నిరూపించారు. ఈ క్రమంలోనే కొందరు.. కాళ్లు, పాదాల ఫోటోలను అమ్ముకుంటూ డబ్బు సంపాదిస్తున్నారు.
ఒకప్పుడు డబ్బులు సంపాదించాలంటే.. చాలా కష్టపడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు టెక్నాలజీ అనేక దారులను చూపిస్తోంది. టాలెంట్ ఉంటే.. ఇంట్లోనే కూర్చుని డబ్బులు సంపాదించొచ్చు. ఈ క్రమంలోనే యూఎస్‌ఏ, పోర్ట్‌ల్యాండ్‌కు చెందిన 28 ఏళ్ల స్వీట్ అర్చెస్.. తన అందమైన కాళ్లు, పాదాల ఫొటోలను అమ్ముకుంటూ.. మనీ ఎర్న్ చేస్తోంది. ఓ హాస్పిటల్ థియేటర్‌లో పనిచేసే అర్చెస్ పార్ట్‌టైమ్‌గా ‘ఫుట్ ఫెటిషిస్ట్’గా మారింది.
అర్చెస్ ఫాంపర్డ్ పాదాలను చూసేందుకు ప్రతీ రోజు లక్షకు పైగా ఫ్యాన్స్ ఎదురు చూస్తుంటారు. అల వైకుంఠపురంలో సినిమాలో అల్లు అర్జున్.. హీరోయిన్ పూజ హెగ్డే కాళ్లతో ప్రేమలో పడ్డట్లు.. అర్చెస్ ఫ్యాన్స్ కూడా తన కాళ్లను చూస్తూ.. ‘నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు, ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్లకు దయలేదా అసలు’ అని పాడుకుంటారు. సంవత్సరం క్రితం సరదాగా ఆమె తన పాదాల ఫోటోలను ఇన్‌స్టాలో అప్‌లోడ్ చేయడం ప్రారంభించగా.. ప్రస్తుతం ఆ ఫోటోలే ఆమెకు ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నాయి. ఆ తర్వాత ఆమె స్పెషల్ ఫ్యాన్స్ పేజీ కూడా స్టార్ట్ చేసింది. అందులో జాయిన్ కావాలంటే.. మంత్లీ సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాలి. ఇండివిడ్యువల్ వీడియోస్, కస్టమ్ కంటెంట్ కావాలంటే.. సెపరేట్‌గా పే చేయాల్సి ఉంటుంది. తన ఫ్యాన్స్.. తనను తన పాదాలను ముద్దాడాలని అడగడంతో పాటు ఆమె వేసుకున్న చెప్పులు, బూట్లు ఇవ్వమని అడుగుతుంటారు. ఇక ప్రకటనల కోసం కూడా తన పాదాల ఫోటోలను ఆయా సంస్థలు తగిన మొత్తం చెల్లించి వాడుకుంటాయి. తన పాదాలను ఎప్పుడూ అందంగా ఉంచుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు పెడిక్యూర్స్, నెయిల్ పెయింటింగ్స్ వేస్తుంది. అర్జెస్ ఇలా తన కాళ్ల ఫోటోలను అమ్ముకుని నెలకు 6 లక్షలకుపైనే సంపాదిస్తోంది.
అమ్మాయిల కాళ్లే కాదు.. అబ్బాయిలు కూడా తమ కాళ్ల ఫోటోలను అమ్మకానికి పెడుతుంటారు. అమెరికా, అరిజోనాకు చెందిన 35 ఏళ్ల జాసన్ స్ట్రామ్ పాదాల ఫోటోలను అమ్ముకుంటూ.. నెలకు రూ. 2.9 లక్షలు సంపాదిస్తున్నాడు. మొదట్లో వెబ్‌కామర్‌గా పనిచేసే జాసన్.. ఆ తర్వాత ‘ఫుట్ ఫెటిషిస్ట్’గా మారిపోయాడు. అర్చెస్‌లానే జాసన్ కూడా మొదట తన పేరు మీద ఇన్‌స్టా అకౌంట్ ఓపెన్ చేసి.. కాళ్లు, పాదాల ఫోటోలు పెట్టడం ప్రారంభించిన కొన్ని రోజులకే మంచి స్పందన రావడంతో.. స్పెషల్ ఫ్యాన్స్ పేజీని ఓపెన్ చేశాడు. అతని కంటెంట్‌కు స్టాండర్డ్స్ సబ్‌స్క్రిప్షన్ వస్తుండటంతో నెలకు 7.99 డాలర్లు సంపాదించాడు. ఫ్యాన్స్ పెరుగుతున్న కొద్దీ.. జాసన్ ఆదాయం కూడా పెరుగుతూ వచ్చింది. జాసన్ ఇప్పుడు నెలకు 3000 (రూ.2,22,346/-) డాలర్ల నుంచి 4000 డాలర్ల దాకా సంపాదిస్తున్నాడు. ఆస్ట్రేలియాకు చెందిన రాచెల్ కూడా తన పాదాలను, కాళ్లను ‘ఇన్‌స్టా ఫీట్’ అకౌంట్లో షేర్ చేస్తూ ఆదాయాన్ని గడిస్తోంది.
ఇలా కేవలం తమ కాళ్ల ఫొటోలు, వీడియోలు తీసి లక్షల్లో సంపాదించేవారు ఇంకెంతోమంది ఉన్నారు. కాళ్లపై వ్యామోహం పెంచుకునేవాళ్లను ‘ఫుట్ ఫెలిషిస్మ్’ అంటారు.