గుమ్మడిదలలో కొత్త టోల్‌గేట్ ప్రారంభం.. వారికి విజ్ఞప్తి

by Shyam |   ( Updated:2021-12-18 03:20:37.0  )
గుమ్మడిదలలో కొత్త టోల్‌గేట్ ప్రారంభం.. వారికి విజ్ఞప్తి
X

దిశ, గుమ్మడిదల : సంగారెడ్డి జిల్లాలోని గుమ్మడిదల, బొంతపల్లి మధ్య కొత్త టోల్‌గేట్ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో గుమ్మడిదల మండలంలో ఉన్న 13 గ్రామాల ప్రజలు ఓనర్ ఓన్ ప్లేట్ గల వాహనదారులు తమ ఆధార్ కార్డ్, వాహనం ఆర్సీ జిరాక్స్ కాపీని టోల్‌గేట్ సిబ్బందికి చూపించి వారు ఫ్రీ పాస్ తీసుకోగలరని టోల్‌గేట్ మేనేజర్ జితిష్ లక్స్సార్ తెలిపారు. వారు ఎటువంటి డబ్బులు చెల్లించవలసిన అవసరం లేదని అన్నారు. ఈ సౌకర్యం కేవలం గుమ్మడిదల మండలం ప్రజల వరకే వర్తిస్తుందని ప్రజలందరూ సహకరించాలని కోరారు.

Advertisement

Next Story