- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
126 జంతువుల్లో కరోనా వైరస్.. భవిష్యత్‌లో మరిన్ని వైరస్‌లు..!
దిశ, ఫీచర్స్ : కొవిడ్ మహమ్మారికి వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంతో పాటు వైరస్ ఉధృతి కూడా తగ్గిందనుకుంటున్న తరుణంలో.. మరోసారి కొత్త స్ట్రెయిన్ కేసులు ప్రజలను కలవరపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో వందలాది జంతుజాతులు, ప్రధానంగా క్షీరదాలు అనేక రకాల కరోనా వైరస్‌లను వ్యాపింపచేయగలవని ఓ అధ్యయనంలో వెల్లడికావడం మరింత ఆందోళనకు గురిచేస్తోంది. ఈ మేరకు కరోనా వైరస్‌ను అతిపెద్ద వైరస్‌ల సమూహంగా చెప్పొచ్చని, ఆయా జంతుజాతుల నుంచి మరిన్ని కొత్త కరోనా వైరస్‌లు పుట్టుకొచ్చే అవకాశముందని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవలే నేచర్ కమ్యూనికేషన్స్ జర్నల్‌లో ఈ పరిశోధన ఫలితాలు ప్రచురితమయ్యాయి.
మనుషులకు సార్స్ కొవ్(SARS-CoV), మెర్స్ కొవ్ (MERS-CoV), సార్స్ కొవ్-2 (SARS-CoV-2)తో సహా ఏడు కరోనా వైరస్‌లు మాత్రమే సంక్రమిస్తాయి. ఇవన్నీ తీవ్రమైన వ్యాధి లక్షణాలు కలిగి ఉండి, మరణానికి కారణమవుతాయి. ఇప్పటి వరకు వందలాది జంతువుల్లో ఏకైక కరోనా వైరస్ స్ట్రెయిన్‌ను గుర్తించగా, కొన్ని జంతువుల్లో ఒకే సమయంలో భిన్నమైన కరోనావైరస్‌లు స్ర్పెడ్ అవుతాయని అధ్యయనంలో వెల్లడైంది. అంతేకాదు బహుళ కరోనా వైరస్‌ల బారిన పడిన జంతువుల్లో.. భిన్నమైన వైరస్‌ల నుంచి మిళితమైన జన్యువులు కలిసి మరో కొత్త వైరస్‌ను సృష్టిస్తాయి. ఈ సహజ ప్రక్రియను రీకాంబినేషన్ (పునఃసంయోగం) అంటారు. ఇది కొవిడ్-19కు కారణమయ్యే నావల్ కరోనా వైరస్ అయిన సార్స్ కొవ్-2 (SARS-CoV-2) పుట్టుకకు కారణమవుతుంది.
శాస్త్రవేత్తల బృందం.. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ డేటాబేస్‌తో పాటు జెన్‌బ్యాంక్ నుంచి సేకరించిన డేటాను ఉపయోగించి 411 కరోనా వైరస్‌లను 876 క్షీరద జాతులతో పోల్చి చూడగా, వాటన్నింటిలోనూ కరోనా వైరస్ ఉందని తేలింది. సగటున 12 కంటే ఎక్కువ రకాల క్షీరదాలు, ప్రతి కరోనా వైరస్ జాతికి హోస్ట్‌గా మారుతాయని అంచనా వేసింది. ఈ క్రమంలో ప్రతీ క్షీరద వాహకం సుమారు ఐదు రకాల కరోనా వైరస్‌లకు ఆశ్రయమిస్తాయని ఫలితాలు సూచించాయి. డొమెస్టిక్ పిగ్ అధిక ప్రమాదాన్ని కలిగిస్తుందని అధ్యయనం పేర్కొనగా, ఇది విభిన్న రకాల కరోనా వైరస్‌లను కలిగి ఉంది.
సార్స్ కొవ్ 2తో కలిసే ఇతర కరోనా వైరస్ జాతులను కూడా ఈ అధ్యయనం గుర్తించగా.. వీటిలో ఆసియాటిక్ ఎల్లో బ్యాట్, ముళ్ల పంది, యూరోపియన్ కుందేలు, చింపాంజీలు, ఆఫ్రికన్ గ్రీన్ మంకీ, పెంపుడు పిల్లులు ఉన్నాయి. ఇక ఈ జాబితాలో డ్రొమెడరీ ఒంటె కూడా ఉండగా, ఇది బహుళ కరోనా వైరస్‌లకు వాహకంగా ఉంది. వీటి ద్వారానే మానవులకు మెర్స్ కొవ్ వచ్చే అవకాశం ఉంది. మెర్స్ కొవ్, సార్స్ కొవ్-2 రెండు సంయోగం చెందితే.. అత్యంత ప్రమాదకర వైరస్ ఉత్పన్నమవుతుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు.