ఏపీ ప్రజలకు శుభవార్త చెప్పిన సీఎం జగన్

by srinivas |
ap cm jagan
X

దిశ, ఏపీ బ్యూరో: అగ్రవర్ణాలలోని నిరుపేద మహిళలకు సీఎం వైఎస్ జగన్ గుడ్ న్యూస్ తెలిపారు. జనవరి9న ఈబీసీ నేస్తం పథకాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో స్పందన కార్యక్రమంలో భాగంగా సీఎం వైఎస్ జగన్, ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ… జనవరిలో ప్రభుత్వం అమలు చేయబోయే సంక్షేమ పథకాలను వివరించారు. జనవరి 1నుంచి పెన్షన్లు పెంచనున్నట్లు ప్రకటించారు. రూ.250 పెంచాలని నిర్ణయించారు. దీంతో ఏపీలో వృద్ధాప్య పింఛన్ 2,250 నుంచి రూ.2500కు పెరగనుంది. తాజాగా అగ్రవర్ణాల్లోని నిరుపేద మహిళలకు అంటే 45 ఏళ్ల నుంచి 60ఏళ్ల మధ్య ఉన్న మహిళలకు ఏడాదికి రూ.15వేలు చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపారు. మెుత్తం మూడేళ్లలో రూ.45వేలు అందించనున్నట్లు సీఎం జగన్ స్పష్టం చేశారు. అలాగే జనవరిలో రైతు భరోసా అమలు కూడా చేస్తున్నట్లు ప్రకటించారు. మెుత్తానికి పింఛన్ పెంపుతో వృద్ధులకు నూతన ఏడాది కానుకగా… ఈబీసీలకు సంక్రాంతి కానుకగా ఈబీసీ నేస్తం ప్రకటించినట్లు తెలుస్తోంది.

Next Story