- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జనవరి 1 నుంచి క్రెడిట్, డెబిట్ కార్డు లేకుండానే షాపింగ్..
దిశ, వెబ్‌డెస్క్: ఆన్‌లైన్ షాపింగ్ కొనుగొళ్ళ కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనవరి 1, 2022 నుంచి కొత్త పద్దతిని తీసుకొచ్చింది. ఆన్‌లైన్ షాపింగ్ వెబ్‌సైట్‌లైన Amazon, Flipkart, Myntra, BigBasket వంటి వాటిలో కొనుగోళ్ళు సులభతరం కానున్నాయి. ఈ కొత్త విధానం ద్వారా ఆన్‌లైన్ కార్డ్ చెల్లింపులు సురక్షితంగా ఉంటాయి. ఈ విధానం ద్వారా ఇక నుంచి ఏటీఎం కార్డు 16 అంకెలు, కార్డ్ గడువు తేదీని గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. RBI కొత్తగా ‘టోకనైజేషన్’ అని పిలిచే కాంటాక్ట్‌లెస్ చెల్లింపులను ప్రవేశపెట్టింది.
టోకనైజేషన్ అనేది కార్డ్ సమాచారాన్ని టోకెన్‌తో ఇచ్చిపుచ్చుకునే సాంకేతికత. కొనుగోళ్ళు చేసేటపుడు కార్డుకు బదులుగా టోకెన్ ద్వారా ట్రాన్సాక్షన్ జరుగుతుంది. టోకనైజేషన్‌లో కార్డు వివరాలు టోకెన్ అనే ప్రత్యేక కోడ్‌తో ఉంటాయి. దీనిలో టోకెన్ కార్డు, టోకెన్ రిక్వెస్ట్(కార్డు టోకనైజేషన్ కోసం కస్టమర్ నుంచి వచ్చిన రిక్వెస్ట్ అంగీకరించి, టోకెన్ జారీ చేయడానికి కార్డు నెట్‌వర్క్‌కి పంపే ఎంటిటి) వంటివి ఉంటాయి. దీనితో పాయింట్ ఆఫ్ సేల్, QR కోడ్ చెల్లింపులు కూడా చేయవచ్చు. దీని ద్వారా ఇ-కామర్స్ వెబ్‌సైట్‌లలో కార్డుకు సంబంధించిన వివరాలు సేవ్ చేయడానికి కుదరదు.
టోకెన్ కావాలనుకున్నవారు యాప్‌లో రిక్వెస్ట్ పెట్టడం ద్వారా తమ కార్డులను టోకనైజేషన్ చేసుకోవచ్చు. వీసా,మాస్టర్ కార్డు వంటి కంపెనీలు టోకెన్ సర్వీస్ ప్రొవైడర్లుగా పనిచేస్తాయి. టోకనైజేషన్ పూర్తిగా ఉచితంగా లభిస్తుంది. వినియోగదారులు తమకు నచ్చినన్ని కార్డులను టోకనైజ్ చేయవచ్చు. కార్డులను ఎప్పుడైనా టోకెన్ నుంచి తొలగించే అవకాశం కూడా ఉంది. దేశీయ కార్డులకు మాత్రమే టోకనైజ్ సదుపాయం ఉంది.