- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మంత్రులు బొత్స, పెద్దిరెడ్డికి కొత్త బాధ్యతలు
by srinivas |
X
దిశ, ఏపీ బ్యూరో: పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కొత్త బాధ్యతలు అప్పగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సంక్షేమ పథకాల అమలు తీరు, పాలనలో విప్లవాత్మక సంస్కరణలకు నాందిపలికిన గ్రామ సచివాలయ, వలంటీర్ల శాఖను ఆయనకు కేటాయించింది. అదే విధంగా వార్డు సచివాలయాలు, వాలంటీర్ల శాఖను పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు కేటాయించింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 166 అధికరణలో గల క్లాజ్(3), ఏపీ ప్రభుత్వ బిజినెస్ రూల్స్ ఆరులోని సబ్ రూల్(1) ప్రకారం ఆంధ్రప్రదేశ్ గవర్నర్, గ్రామ/వార్డు వలంటీర్లు, గ్రామ సచివాలయాలు/ వార్డు సచివాలయాల శాఖకు సంబంధించి ఈ మేరకు శాఖలు కేటాయించినట్లు తెలిపింది.
Advertisement
Next Story