- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కొత్త పోస్టర్లు సరే.. రిలీజ్ డేట్లు ఎక్కడ?
దిశ, వెబ్ డెస్క్: కరోనా దెబ్బకు చిత్ర పరిశ్రమ మరోసారి కుదేలయ్యింది. ఇప్పటీకే కరోనా కారణంగా థియేటర్లు మూత పడ్డాయి. ఇక ఈ నెలలో రావాల్సిన సినిమాలు సైతం వెనకడుగు వేసుకొని కొత్త రిలీజ్ డేట్ ని వెతుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమాల విడుదలకు మోక్షం ఎప్పుడు కలుగుతుందో అని ఎదురు చూస్తున్నారు సినీ ప్రేక్షకులు. ఒకప్పుడు పండగ వచ్చిందంటే తమ అభిమాన హీరోల కొత్త పోస్టర్లు, పండగ విషెస్ తో సోషల్ మీడియా కళకళలాడుతూ ఉండేది. ఇప్పుడు ఆ కళ తగ్గిందనే చెప్పాలి. నేడు శ్రీరామ నవమి పండగ.. ఈ పండగను పురస్కరించుకొని పలువురు ప్రముఖులు అభిమానులకు పండగ శుభాకాంక్షలు తెలిపారు. మరి కొందరు హీరోలు తమ కొత్త సినిమాల, కొత్త పోస్టర్లను రిలీజ్ చేసి అభిమానులకు కొంచమైనా ఆనందాన్ని నింపారు. అయితే ఏ పోస్టర్ లోను రిలీజ్ డేట్ ఇవ్వకపోవడం గమనార్హం.
#RamNavami Posters Thread
Cont…. pic.twitter.com/CbfCvrBlkf
— AndhraBoxOffice.Com (@AndhraBoxOffice) April 21, 2021
Cont….#RamNavami Posters Thread
Cont…. pic.twitter.com/GAMvmkXLIv
— AndhraBoxOffice.Com (@AndhraBoxOffice) April 21, 2021
కరోనా కారణంగా వాయిదా పడిన సినిమాల కొత్త రిలీజ్ డేట్లు ఎప్పుడు అనేది అభిమానులు ఆసక్తిగా అడుగుతున్న ప్రశ్న. రోజురోజుకు కేసులు పెరుగుతుండడంతో నిర్మాతలు సైతం దైర్యం చేయలేకపోతున్నారన్నది వాస్తవం. ఇకపోతే వచ్చినా కొన్ని పోస్టర్లు మాత్రం నెట్టింట వైరల్ గా మారాయి. నాని ‘టక్ జగదీష్’, నాగ శౌర్య ‘వరుడు కావలెను’, రవితేజ’ ఖిలాడీ’, నితిన్ ‘మాస్ట్రో’ సందీప్ కిషన్ ‘గల్లీ రౌడీ’ లాంటి చిత్రాల మేకర్స్ తమ కొత్త చిత్రాల కొత్త పోస్టర్ ని రిలీజ్ చేసి ప్రేక్షకులకు శ్రీరామనవమి శుబాకాంక్షలు తెలిపారు. అయితే ప్రభాస్ ఫాన్స్ మాత్రం కొంత అసహనానికి గురు అవుతున్నారు. ప్రభాస్ నటిస్తున్న ‘ఆదిపురుష్’ చిత్రం నుండి ప్రభాస్ లుక్ ని శ్రీరామనవమి పండగ సందర్భంగా విడుదల చేస్తారని ఆశగా ఎదురుచూసిన వారికి నిరాశే మిగిలింది.