శ్రీకాళహస్తిలో కొత్త విగ్రహాల కలకలం 

by srinivas |   ( Updated:2020-09-22 04:00:30.0  )
శ్రీకాళహస్తిలో కొత్త విగ్రహాల కలకలం 
X

దిశ, వెబ్ డెస్క్: శ్రీకాళహస్తి ఆలయంలో కొత్త విగ్రహాల ప్రతిష్ట కలకలం రేపింది. ఈ కేసులు ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులు పుత్తూరుకు చెందిన మునిశేఖర్, తిరుమలయ్య, శూలవర్ధన్ అనే ముగ్గురు సోదరులుగా గుర్తించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను మంగళవారం అర్బన్ ఎస్పీ రమేష్ రెడ్డి మీడియాకు వెల్లడించారు.

కేసు విచారణలో భాగంగా సిసి ఫుటేజీలను పరిశీలించినట్టు ఎస్పీ తెలిపారు. వ్యక్తిగత సమస్యల కారణంగా, దోష నివారణ కోసం ఆలయంలో విగ్రహాలు ప్రతిష్టించినట్టు విచారణలో వెల్లడైందన్నారు. ఆర్థిక ఇబ్బందులు, దోషాలు తొలగిపోవడం, పెళ్ళిళ్ళు అవుతాయన్న నమ్మకంతో నంది, శివలింగాలను పెట్టినట్టు పేర్కొన్నారు.

ఈనెల 2వ తేదీన తిరుపతిలోని రాజీవ్ గృహకల్ప ఇళ్ళ వద్ద విగ్రహాలు తయారీ చేసినట్లు, ఈనెల 6వ తేదీన శ్రీకాళహస్తి ఆలయంలో ప్రతిష్టాపన చేసినట్లు తెలిపారు. అన్ని ఆధారాలను సేకరించిన తర్వాతే నిందితులను అరెస్టు చేశామని అర్బన్ ఎస్పీ మీడియాకు స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed