- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Vaccination: వ్యాక్సినేషన్‌పై కేంద్రం కొత్త మార్గదర్శకాలు.. ఇకపై మూడు నెలల గ్యాప్
దిశ, వెబ్‌డెస్క్ : వ్యాక్సినేషన్ ప్రక్రియపై కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. నిపుణుల కమిటీ చేసిన సూచనలకు కేంద్రం బుధవారం ఆమోదం తెలిపింది. దీని ప్రకారం.. టీకా తీసుకున్న 14 రోజుల తర్వాత రక్తదానం చేయొచ్చని ప్రకటించింది. బాలింతలు కూడా టీకా తీసుకోవచ్చని సూచించింది.
కరోనా మహమ్మారి పరిణామం, వెలుగులోకి వచ్చిన సరికొత్త శాస్త్రీయ ఆధారాలకు అనుగుణంగా ఈ సిఫారసులున్నాయని వివరించింది. ఈ సిఫారసులను అమలు చేయాల్సిందిగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. గర్భిణీలకు టీకా వేసే అంశంపై ఇంకా చర్చ జరుగుతున్నదని తెలిపింది.
♦కరోనా బారిన పడి కోలుకున్నవారికి మూడు నెలల తర్వాతే టీకా వేయాలి.
♦ప్లాస్మా థెరపీ చేసుకున్నవారికీ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన మూడు నెలల తర్వాతే టీకా వేయాలి.
♦ఫస్ట్ డోసు తీసుకున్న తర్వాత కరోనా సోకిన వారికీ సెకండ్ డోసు కోసం రికవరీ అయిన తర్వాత మూడు నెలలు ఆగాల్సిందే.
♦ఇతర వ్యాధులు, అనారోగ్యంతో హాస్పిటల్‌లో, ఐసీయూల్లో చికిత్స పొందుతున్నవారికీ టీకా పంపిణీని నాలుగు నుంచి ఎనిమిది వారాలపాటు వాయిదా వేయాలి.
♦బాలింతలూ టీకా వేసుకోవచ్చు.
♦కొవిడ్ టీకా వేసుకున్న 14 రోజుల తర్వాత లేదా, కరోనా సోకి ఉంటే ఆర్టీ పీసీఆర్‌లో నెగెటివ్ రిపోర్ట్ వచ్చిన 14 రోజులకు రక్తాన్ని దానం చేయవచ్చు.
♦టీకా పంపిణీకి ముందు లబ్దిదారులకు ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులు చేయాల్సిన అవసరం లేదు.