ఇది తిరస్కరణ కాదు..చైనా విమర్శలపై భారత్ సమాధానం!

by Harish |
ఇది తిరస్కరణ కాదు..చైనా విమర్శలపై భారత్ సమాధానం!
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల భారత ప్రభుత్వం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ) సవరణను ప్రకటించింది. ఈ పాలసీ సవరణలపై చైనా వివక్షాపూరితమంటూ బాధను వెల్లగక్కింది. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వ వర్గాలు స్పందించాయి. తాము తీసుకున్న నిర్ణయం ఆమోద ప్రక్రియ మాత్రమేనని, ఇది అనుమతి తిరస్కరణ అవ్వదని వెల్లడించాయి. ఇందులో ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనల ఉల్లంఘన లేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి.

చైనా స్పందనను ఖండించిన ప్రభుత్వ వర్గాలు…పెట్టుబడులకు సంబంధించిన చర్యలపై వస్తువుల వాణిజ్యం ఎలా ప్రభావితమవుతాయని చెప్పాయి. ఇది అధికారికంగా భిన్న విధానాన్ని సూచిస్తుందని అధికారులు వివరించారు. ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ పతనమవుతున్న ఈ సందర్భంలో ఇతర దేశాల పెట్టుబడిదారులు ఇండియాలోని సంస్థల్లో వాటాలను దక్కించుకోవడానికి కేంద్ర కఠిన నిర్ణయాలు తీసుకుంది. అమెరికాలోని కంపెనీల్లో చైనా వాటాఉ కొనుగోలు చేయడం, ఇండియాలోని ప్రైవేట్ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీలో చైనా సెంత్రల్ బ్యాంక్ 1 శాతం వాటాను కొనుగోలు చేయడం వంటి పరిణామాలతో ఎఫ్‌డీఐ నిబంధనలను కఠినతరం చేసింది. ఇకమీదట ఇండియాలోని కంపెనీల్లో సరిహద్దు దేశాల కంపెనీలు, వ్యక్తులు పెట్టుబడులు పెట్టాలంటే భారత ప్రభుత్వ అనుమతి తప్పనిసరిగా అవసరం.

Tags: FDI, China, FDI Policy, Government Sources, New FDI Rules, China Criticism

Advertisement

Next Story