అమెరికా ప్రెసిడెంట్ ఎలక్షన్సె టార్గెట్..

by Harish |
అమెరికా ప్రెసిడెంట్ ఎలక్షన్సె టార్గెట్..
X

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. డెమోక్రటిక్ పార్టీ తరఫున జో బైడెన్ , రిపబ్లికన్ పార్టీ నుంచి డొనాల్డ్ ట్రంప్‌లు పోటీ పడుతున్న విషయం తెలిసిందే. ఎన్నికలు(నవంబర్ 3) సమీపిస్తుండటంతో ఒకరిని మించి మరోకరు తమ వ్యూహా, ప్రతివ్యూహాలతో ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికలను, పోటీపడే అభ్యర్థులను ప్రభావితం చేసేందుకు రష్యా, చైనా, ఇరాన్‌కు చెందిన హ్యాకర్లు ప్రయత్నిస్తున్నట్లు మైక్రోసాఫ్ట్‌గా తాజాగా వెల్లడించింది. 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికలనే టార్గెట్ చేస్తూ హ్యాకర్లు సిద్దమవుతున్నారు. ఇప్పటివరకు ఎలాంటి హ్యాకింగ్ జరగలేదని, హ్యాకర్ల చేసే దాడులను ముందుగానే గుర్తించామని మైక్రోసాఫ్ట్ తెలిపింది.

స్ట్రాంటియమ్:

రష్యాకు చెందిన స్ట్రాంటియమ్ అనే హ్యాకింగ్ సంస్థ. పొలిటికల్ క్యాంపెయిన్స్, అడ్వొకసీ గ్రూప్స్, పార్టీలు, పొలిటికల్ కన్సల్టెంట్స్‌లకు చెందిన దాదాపు 200లకు పైగా ఆర్గనైజేషన్స్‌ను టార్గెట్ చేసినట్లు మైక్రోసాఫ్ట్ గుర్తించింది.

జిర్కోనియం:

దీన్ని చైనా నుంచి ఆపరేట్ చేస్తున్నారు. ఈ సంస్థకు చెందిన హ్యాకర్లు ప్రధానంగా హైప్రొఫైల్ వ్యక్తులను టార్గెట్ చేస్తారు. అందులోనూ ఎలక్షన్‌కు సంబంధించి జో బైడెన్ ప్రచారంలో కీలకంగా వ్యవహరించే వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని హ్యాకింగ్‌కు పాల్పడుతారు. అంతర్జాతీయ వ్యవహరాలు ప్రభావితం చేసే వ్యక్తులు కూడా ఈ జాబితాలో ఉన్నారు. ఈ సంస్థ గతంలోనూ చాలా సార్లు ఇలాంటి చర్యలకు పాల్పడినట్లు మైక్రోసాఫ్ట్ స్పష్టం చేసింది.

ఫాస్పరస్:

ఈ సంస్థ ఇరాన్ నుంచి ఆపరేట్ అవుతోంది. ఇది ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌‌తో సంబంధం ఉన్న వ్యక్తుల పర్సనల్ అకౌంట్లను టార్గెట్ చేస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ వెల్లడించింది. తమ సెక్యూరిటీ టూల్స్ ఆధారంగా ఈ సైబర్ అటాక్‌లను ముందు పసిగట్టినట్లు, పొలిటకల్ ప్రాసెస్‌లో ఇన్వాల్వ్ అయిన వ్యక్తులకు మరింత సెక్యూరిటీ టూల్స్ అందించేందుకు పలు టూల్స్ అందుబాటులో ఉన్నాయని మైక్రోసాప్ట్ తెలిపింది. ‘అకౌంట్ గార్డ్’, ‘మైక్రోసాఫ్ట్ 365 ఫర్ క్యాంపెయిన్స్’ ‘ఎలక్షన్ సెక్యూరిటీ అడ్వైజర్స్’ తదితర టూల్స్ క్యాంపెయిన్స్, వలంటీర్ల ఖాతాలను సురక్షితంగా ఉంచుతాయని తెలిపింది.

Advertisement

Next Story