- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
తొలిరాత్రే భార్యకు చుక్కలు చూపించిన భర్త.. టాబ్లెట్స్ వేసుకొని
దిశ, వెబ్‌డెస్క్: ఎన్నో ఆశలతో ఆమె అత్తింటిలో అడుగుపెట్టింది. భర్త ప్రేమ, అత్తమామల ఆప్యాయత ఎప్పుడూ ఉంటాయని అనుకుంది. కానీ, తొలిరాత్రే ఆమెకు కాళరాత్రి అయ్యింది. భర్త తనపై అయిష్టం చూపిస్తుంటే కొత్త కదా అని సర్దుకుపోయింది. రోజు ఏవేవో టాబ్లెట్ లు వేసుకొని పడుకుంటుంటే ఆరోగ్య సమస్యలేమో అని తనను తానూ సముదాయించుకుంది. ఇలా రోజులు గడుస్తున్నా కొద్దీ భర్త రాలేదు సరికదా.. ఇంకా దూరం పెట్టడం ప్రారంభించాడు. ఇక తట్టుకోలేక ఒకరోజు అత్తగారిని నిలదీసింది. భర్త విచిత్ర ప్రవర్తనకు కారణం.. తాను ఇష్టం లేకపోవడం కాదని, అతనికి చిన్నప్పటి నుంచి మానసిక పరిస్థితి సరిగ్గా లేదని, టాబ్లెట్స్ వేసుకోకపోతే పిచ్చివాడిలా మారిపోతాడని తెలుసుకొని నివ్వెరపోయింది. తమ కొడుకు సమస్య చెప్పకుండా తనకిచ్చి పెళ్ళిచేసి గొంతు కోశారని నవవధువు న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించింది.
వివరాలలోకి వెళితే.. తాడేపల్లిలో పనిచేస్తున్న ఓ మహిళ తన కుమారుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి అని నమ్మించి గుంటూరుకు చెందిన యువతితో సంబంధం కుదుర్చుకుంది. మే 26న వివాహం జరిగింది. ఈ సందర్భంగా యువతి తల్లిదండ్రులు రూ. 6 లక్షల కట్నం సమర్పించుకున్నారు. పెళ్లి ఖర్చులంటూ అత్తగారు మరో రూ. 2 లక్షలు లాగేశారు. కూతురు సంతోషంగా ఉండాలని తల్లిదండ్రులు సైతం డబ్బుకు వెనకాడలేదు. ఇక మొదటి రాత్రి.. ఎన్నో ఆశలతో యువతి గదిలోకి అడుగుపెట్టింది. ఎంతో అపురూపంగా దగ్గరకు తీసుకొంటాడనుకున్న భర్త.. వింతగా ప్రవర్తించాడు. ఈ వయసులో కోరికలు ఉండకూడదని ఆమెకు హితవు పలికి టాబ్లెట్స్ వేసుకొని పడుకున్నాడు. అతడి ప్రవర్తన చూసి విస్తుపోయిన వధువుకు రెండో రోజు, మూడో రోజు కూడా ఇదే సీన్ రిపీట్ అవ్వడంతో అతడిని నిలదీసింది. దీంతో అతడు ..భార్యాభర్తలు అంటే శారీరక సంబంధం కాదని, మంచి స్నేహితులుగా ఉందామని నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. భర్త మాటలు విన్న ఆమె నిర్ఘాంతపోయింది.
టాబ్లెట్స్ ఎందుకు వేసుకుంటున్నారు అని అడిగితే.. అవి వేసుకోకుంటే తలనొప్పి, నోటివెంట సొంగ పడుతుందని, తన ఆరోగ్యం బాగాలేదని, మానసిక స్థితి కూడా సరిగా లేదని చెప్పడంతో యువతి షాక్‌కు గురైంది. విషయం తల్లిదండ్రులకు చెప్పడంతో వారు అత్తింటివారిని నిలదీశారు. తమ కొడుకుకు తలనొప్పి తప్ప వేరే అనారోగ్యం ఏమి లేదని బుకాయించారు అత్తమామలు. కావాలంటే అతడు చికిత్స తీసుకుంటున్న వైద్యులకు ఫోన్ చేయాలని కోరారు. బాధితురాలు వారితో మాట్లాడగా మరిన్ని షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. అతడి మానసిక స్థితి సరిగా లేదని, మాత్రలు వాడకపోతే ప్రమాదమని చెప్పడంతో ఆమె మోసపాయానని తెలుసుకుంది. కొడుకు ఆరోగ్య సమస్య చెప్పకుండా పెళ్లి చేసినందుకు ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. సంసారానికి పనికిరాని వ్యక్తితో వివాహం చేసి తన జీవితాన్ని నాశనం చేశారని, తనకు న్యాయం చేయాలంటూ వేడుకుంది.