- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
OTT లవర్స్‌కు త్వరలోనే NETFLIX గుడ్‌న్యూస్..
దిశ, ఫీచర్స్ : అమెరికా దిగ్గజ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్.. ఇండియాలోనూ ఆన్-డిమాండ్ వీడియో స్ట్రీమింగ్ సర్వీస్‌గా మారిపోయిన విషయం తెలిసిందే. అతి తక్కువ కాలంలోనే ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరణ దక్కించుకుని టాప్ ఓటీటీ స్ట్రీమింగ్ సర్వీస్‌గా దూసుకుపోతోంది. ఎంటర్‌టైన్‌మెంట్ సేవలు అందిస్తూనే సొంతంగా వెబ్‌సిరీస్‌లు, సినిమాలు నిర్మిస్తూ ఓటీటీ మార్కెట్‌లో ఆధిపత్యం చూపిస్తున్న నెట్‌ఫ్లిక్స్.. త్వరలోనే గేమింగ్ ప్లాట్‌ఫామ్‌ను కూడా ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.
ఈ మేరకు మాజీ ఎలక్ట్రానిక్ ఆర్ట్స్, ఫేస్‌బుక్ ఎగ్జిక్యూటివ్ మైక్ వెర్డును గేమ్ డెవలప్‌మెంట్ వైస్ ప్రెసిడెంట్‌గా నియమించింది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ ప్లాట్‌ఫామ్ సినిమాలు, టీవీ కార్యక్రమాలను మాత్రమే అందిస్తుండగా.. వచ్చే ఏడాది వరకు గేమింగ్ జోన్‌లోనూ సత్తా చాటేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ‘ఫ్రీ-టు-ప్లే స్ట్రేంజర్ థింగ్స్’ మొబైల్ గేమ్‌ను ‘E3 2019లో ప్రకటించింది. కాగా నెట్‌ఫ్లిక్స్ తమ సబ్‌స్క్రైబర్స్‌కు ఉచితంగా గేమింగ్ సర్వీసులను అందించనున్నట్లు సమాచారం. ఆండ్రాయిడ్, యాపిల్ రెండు వెర్షన్లలోనూ ఈ గేమింగ్ యాప్ తీసుకురానున్నట్లు తెలుస్తుండగా… ఈ సేవలను యూజర్క్లౌడ్ సర్వీసెస్ ద్వారా ఆన్‌లైన్‌లోనే వినియోగించుకోవచ్చు.