నన్ను సెక్స్‌ టాయ్‌గా మార్చేశారు.. షూటింగ్‌లో ఆ ఫొటోలు చూపించి..

by Shyam |
Neha Sharma
X

దిశ, సినిమా: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘చిరుత’తో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన నేహా శర్మ.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పలు షాకింగ్ విషయాలు వెల్లడించింది. తన ఫొటోను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేయడంపై ఆవేదన వ్యక్తం చేసింది. ‘2018లో నా ఫొటో ఒకటి మార్ఫింగ్‌ చేసి దానికి సెక్స్‌ టాయ్‌ను జత చేశారు. ఆ సమయంలో నేను ‘ఇల్లీగ‌ల్’ వెబ్‌సిరీస్‌లో నటిస్తున్నాను. ఎప్పటిలాగే ఆరోజు కూడా సెట్స్‌పైకి వెళ్లినప్పుడు అందరూ నాతో విచిత్రంగా ప్రవర్తించారు. ఎవరూ నాతో సరిగా మాట్లాడలేదు. నా గురించి ఏదో గుసగుసలు వినిపిస్తున్నాయి. అసలేం జరిగింది? ఎందుకు అందరూ ఇలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నారో అర్థం కాలేదు. ఒంటిరిగా కూర్చున్న నా దగ్గరికి ఒకరు వచ్చి ఆ మార్ఫింగ్‌ ఫొటోను చూపించి.. ఇది నెట్టింట వైరల్‌ అవుతుందని చెప్పాగానే షాక్‌ అయ్యాను. ఎందుకు ఇలా జరిగిందని చాలా బాధపడ్డాను. అప్పటికి నేను చాలా యంగ్‌ ఏజ్‌లో ఉన్నా. ఇలా ఎందుకు చేస్తారు? ఇలాంటివి చేసేవారికి అసలు ఏం పని ఉండదా? ఇలా చేయడం వాళ్లకు న్యాయమేనా?’ అని ప్రశ్నించింది.

Advertisement

Next Story

Most Viewed