మీరు హుక్కా తాగితే లేని కాలుష్యం.. మేము టపాసులు పేలిస్తే పెరిగిందా.. నటిపై నెటిజన్లు ఫైర్

by Shyam |   ( Updated:2021-11-06 08:45:55.0  )
మీరు హుక్కా తాగితే లేని కాలుష్యం.. మేము టపాసులు పేలిస్తే పెరిగిందా.. నటిపై నెటిజన్లు ఫైర్
X

దిశ, సినిమా: దీపావళికి టపాసులు కాల్చడం ఆరోగ్యానికి మంచిది కాదంటూ నేహా ధూపియా విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. కాగా ఆమె మాటలపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. అంతేకాకుండా భారీగా ట్రోలింగ్‌ చేస్తున్నారు. ఆమె పోస్టులను ట్యాగ్ చేస్తూ రకరకాలుగా స్పందిస్తున్నారు. అయితే టపాసులు ప్రాణులకు హాని చేస్తాయని దీపావళికి ముందురోజు ట్వీట్ చేసిన నేహా.. ‘దయచేసి టపాసులను కాల్చడం ఆపేయండి. పర్యావరణానికి ఇవి చాలా ప్రమాదం. మనల్ని చాలా ఇబ్బందులకు గురిచేస్తాయి. భవిష్యత్ తరాలకు కూడా హానిని కలుగజేస్తాయి’ అని పోస్ట్ చేసింది.

ఈ మేరకు ఆమె పోస్ట్‌లపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘ముందుగా విలాసవంతమైన జీవితాన్ని గడపడం ఆపేయండి. గాలిలో కార్బన్ స్థాయిలు పెరగడానికి ఇది కూడా ఒక కారణం. మీ జీవితం కూడా ప్రజలను తీవ్రమైన ఇబ్బందులకు గురిచేస్తుంది’ అని ఒకరు ట్రోల్ చేయగా.. ‘పర్యావరణ మార్పులకు టపాసులు ఏ మాత్రం కారణం కాదు. టపాసులు గాలిని ఎలా కలుషితం చేస్తాయో మీకు తెలుసా. ముందుగా ఫ్రిడ్జ్ ఉపయోగించడం ఆపేసి తర్వాత బోధించండి’ అంటూ మరో నెటిజన్ తెలిపాడు. ఇక మరొకరైతే ఆమె హుక్కాతో ఏంజాయ్ చేస్తున్న ఫొటోను పోస్ట్ చేసి, దాని కింద హ్యాపీ బర్త్ డే నేహా ఆంటీ అని కామెంట్‌ చేయడం విశేషం.

మాల్దీవుల సాక్షిగా ఒక్కటైన బాలీవుడ్ లవ్‌బర్డ్స్.. వీడియో వైరల్.

Advertisement

Next Story