విధుల్లో నిర్లక్ష్యం.. ఇద్దరు పోలీసులపై సస్పెన్షన్

by Shyam |
విధుల్లో నిర్లక్ష్యం.. ఇద్దరు పోలీసులపై సస్పెన్షన్
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని డిచ్‌పల్లి సీఐ వెంకటేశ్వర్లు, నిజామాబాద్ రూరల్ ఎస్ఐ మధు సుధన్ గౌడ్‌లను సస్పెండ్ చేస్తూ.. ఐజీ స్టీఫెన్ రవీంద్ర మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. వివరాళ్లోకి వెళితే… నిజామాబాద్ రూరల్ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న మధు సుధన్‌గౌడ్, డిచ్‌పల్లి సీఐ వెంకటేశ్వర్లు విధుల్లో అలసత్వం వహించి, పెండింగ్ కేసుల పట్ల నిర్లక్ష్యంగా వ్యహరించారనే కారణంతో ఓ ప్రజాప్రతినిధి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో ఈ వేటు పడినట్టు సమాచారం.

Advertisement

Next Story