ఆ వ్యక్తిని అక్కడికెలా ఎక్కిస్తారంటూ విమర్శలు

by Shyam |   ( Updated:2020-06-02 02:28:19.0  )
ఆ వ్యక్తిని అక్కడికెలా ఎక్కిస్తారంటూ విమర్శలు
X

దిశ, మెదక్: సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం నిజాంపూర్ గ్రామంలో ఓ వ్యక్తి తన ప్రాణాలను సైతం లేక్క చేయకుండా అత్యంత భయంకరమైన సాహసం చేశాడు. సోమవారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. వర్షం కారణంగా విద్యుత్ తీగలపై చెట్టు కొమ్మ విరిగి పడింది. దీంతో విద్యుత్ శాఖ అధికారులు ఆ కొమ్మను తొలగించడానికి ఓ వ్యక్తిని ఎటువంటి రక్షణ జాగ్రత్తలు తీసుకోకుండానే తీగలపైకి ఎక్కించారు. సదరు వ్యక్తి ఎంతో సాహసోపేతంగా ఆ కొమ్మను తొలగించినా.. ఈ ఘటనపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. సేఫ్టీ కిట్ లేకుంండా తీగలపై ఎలా ఎక్కిస్తారని జిల్లా వాసులు మండిపడుతున్నారు. దీనిపై సంబంధిత శాఖ ఎలా స్పందిస్తదో వేచి చూడాలి.

Advertisement

Next Story

Most Viewed