వ్యవసాయాన్ని రక్షించుకోవాలి..

by Shyam |   ( Updated:2020-02-22 07:15:40.0  )
వ్యవసాయాన్ని రక్షించుకోవాలి..
X

దిశ,హైదరాబాద్ బ్యూరో

రైతులను, వ్యవసాయ రంగాన్ని రక్షించుకోవడానికి శాస్త్రవేత్తలు, పారిశ్రామిక వేత్తలు కృషి చేయాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు.వాతావారణ మార్పులు, ఇతర అనేక సవాళ్లు దేశంలో వ్యవసాయరంగాన్నివేధిస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం(పీజేటీఏఎస్ఏయూ) ప్రాంగణంలో 3 రోజుల పాటు నిర్వహించనున్న అగ్రిటెక్ సౌత్2020 సదస్సును శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ..పెరుగుతున్నవ్యవసాయ పెట్టుబడులు, కూలీల లభ్యత తగ్గడం వల్ల వ్యవసాయంలో నష్టాలు ఎక్కువగా వస్తున్నాయని వాపోయారు.అనంతరం వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ..రైతుబంధు, రైతు భీమా వంటి పథకాలు కర్షకులకు తెలంగాణ ప్రభుత్వం భరోసానిచ్చిందన్నారు.వ్యవసాయ రంగానికి చేయూత నిచ్చేందుకు అనేక పథకాలను ప్రభుత్వం ప్రవేశపెట్టి, అమలు చేస్తుందన్నారు. 57లక్షల పై చిలుకు రైతులకు రైతుబంధు కింద ఏడాదికి రూ.10 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తున్నామని వివరించారు. ఇందుకు గత బడ్జెట్‌లో రూ.12 వేల కోట్లను కేటాయించిందన్నారు. రైతుల సామాజిక, ఆర్థిక భద్రత కోసం రైతుభీమా పథకం తెచ్చినట్టు గుర్తు చేశారు.మెరుగైన సాంకేతికతను ఉపయోగించుకొని దిగుబడులు పెంచడం,నాణ్యతతో కూడిన ఎరువులు, విత్తనాలు అందజేయడంలో తెలంగాణ ప్రభుత్వం ముందంజలో ఉందన్నారు.కార్యక్రమంలో హోం మంత్రి మహమూద్ అలీ, జయశంకర్ విశ్వవిద్యాలయం వైస్ చాన్సిలర్ వెల్చాల ప్రవీణ్ రావు, శాస్త్రవేత్తలు రైతులు పాల్గొన్నారు.

సూర్యాపేటకు భారీ థర్మల్ విద్యుత్ కేంద్రం

Advertisement

Next Story