- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దాని కోసం ఆమె.. ఆమె కోసం అతడు.. ఏళ్ల తరబడి నగ్నంగా జీవనం
దిశ, వెబ్‌డెస్క్: సమాజంలో బతకాలంటే కొన్ని పద్దతులను పాటించాలి. కొన్ని కట్టుబాట్లను పాటిస్తూ, ఎదుటివారికి ఇబ్బంది కలగకుండా జీవించాలి. లేదు.. నేను ఇలాగే ఉంటాను.. నా ఇష్టం వచ్చినట్లే తిరుగుతాను అంటే కుదరదు. కొన్నిసార్లు అలా చేయాలనీ అనిపించినా చుట్టూ ఉన్నవారు చూస్తూ ఉండరు. ఇక కొన్ని దేశాల కట్టుబాట్లు చాలా కఠినంగా ఉంటాయి. ఇంకొన్ని దేశాలలో చాలా ఫ్రీ గా ఉండొచ్చు. అయితే మనిషి అన్నాకా ఎంతో కొంత ప్రకృతి మీద ప్రేమ ఉంటుంది. ఇంకా ప్రకృతి ప్రేమికులు అయితే.. ఆ ప్రకృతిలోని మమేకం అయిపోతుంటారు. తాజాగా మనము చెప్పుకుంటున్న జంట కూడా అలాంటివారే. ప్రకృతిలో మునిగిపోయి.. కనీసం బట్టలు కూడా వేసుకోవడం మర్చిపోయారట. ఏంటి.. నిజమా అంటే నిజమే మరి. నగ్నంగానే వారు జీవిస్తున్నారు. ఇక వారు విద్యుత్ వాడరు, పైపుల ద్వారా వచ్చే నీటిని తాగరు. అయ్యా బాబోయ్ ఇదేం విచిత్రమైన జంట.. అసలు ఎవరు వీళ్లు అనేగా డౌట్.. తెలుసుకుందాం రండి.
ఇంగ్లండ్ లోని చిప్పెన్హామ్ ప్రాంతానికి చెందిన హెలెన్ కు ప్రకృతి అంటే ప్రేమ.. కాదు పిచ్చి.. కాదుకాదు పిచ్చి ప్రేమ. ఆ ప్రేమతోనే ఆమె ప్రకృతిలోనే మమేకమై జీవిస్తుంది. ఇక ఆమెను, ఆమె సిద్ధాంతాలను ప్రేమించే జాన్ ఆమెను పెళ్లిచేసుకోవడానికి హెలెన్ లా మారిపోయాడు. అతడు కూడా నగ్నంగా మారి, పర్యావరణంలో కలిసిపోయాడు. ఆ ప్రేమతోనే 2011లో జాన్, హెలెన్ ను పురాతన పద్ధతిలో వివాహం చేసుకున్నాడు. ఊరికి దూరంగా ఒక వ్యాన్ లో వీరి కాపురం. అక్కడ వారు బట్టలు వేసుకోరు. విద్యుత్ వాడరు. కుళాయిలలో వచ్చే నీరు తాగరు. అన్ని స్వచ్ఛమైన ప్రకృతి నుంచి వచ్చేవే తింటారు.
ఆ ఇదంతా వ్యాన్ లో ఉండేవరకే.. బయటకు వెళితే బట్టలు వేసుకుంటారు.. అనుకుంటే పప్పులో కాలేసినట్లే. బయటికి వెళ్లినా, ఊర్లో తిరిగినా వారు నగ్నంగానే వెళ్తారు. ఇంకా చెప్పాలంటే వారి వద్ద రెండు టవల్స్ తప్ప వేరే దుస్తులు లేవు అంటే నమ్మగలరా..?. దేవుడా ఇదేం జీవన విధానం. వింటుంటూనే మెంటల్ వచ్చేస్తుంది కదా.. ” మా జీవన విధానం మాది.. మేమెప్పుడూ మాకులా ఉండమని ఎవరిని ఫోర్స్ చేయలేదు. ప్రకృతిలో మమేకం అవ్వడం మాకు ఇష్టం. అలాగే ఉంటున్నాం” అంటూ చెప్పుకొస్తున్నారు ఈ ప్రకృతి ప్రేమికుల జంట.