తలనొప్పి తగ్గాలంటే..

by sudharani |
తలనొప్పి తగ్గాలంటే..
X

తలనొప్పి.. చాలా మందిని వేదిస్తుంటుంది. ఆ నొప్పి భరించలేక.. వెంటనే ఓ టాబ్లెట్‌ వేసుకుని కాస్త ఉపశమనం పొందుతుంటారు. కానీ దాని ఉపయోగం తాత్కాలికమే. టాబ్లెట్స్‌ వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయి. శరీరానికి మందులు అలవాటు చేస్తే.. భవిష్యత్తులో చిన్న చిన్న రోగాలు సైతం మందులకు లొంగకుండా పెద్దవయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకే మందులు వేసుకోకుండా తలనొప్పిని తరిమికొట్టడం ఎలా? ఇంటి చిట్కాలతో తలనొప్పిని దూరం చేయవచ్చా?

నిద్రలేమితో పాటు మనం తీసుకునే ఆహారం, మానసిక ఒత్తిళ్లు, ధ్వని కాలుష్యం, ఎక్కువగా ఏడవటం,వేదన చెందడం.. ఇలా చాలా కారణాల వల్ల మనకు తలనొప్పి వస్తుంటుంది. అంతేకాదు వెన్న, మటన్ ఎక్కువగా తీసుకున్నా కూడా తలపోటు పెరుగుతుంది. సరిపడా మంచినీళ్లు తాగకపోవడం, ఎక్కువ సమయం కంప్యూటర్ స్క్రీన్ చూడటం తలనొప్పికి కారణమవుతాయి. మసాలా ఫుడ్‌కు ఎంత దూరంగా ఉంటే అంత బెటర్. బ్రేక్ ఫాస్ట్ చేయడం మానేస్తే కూడా తలనొప్పి వచ్చే అవకాశం ఉంది. అందువలన బ్రేక్ ఫాస్ట్ ఎట్టి పరిస్థితులలోను మానేయకూడడు.

పోషకాలున్న ఆహారంతో పాటు సరిపడా నిద్రపోవడం, కొద్దిపాటి వ్యాయామం వంటివి చేస్తూ ఉంటే తలనొప్పి దూరమవుతుంది. ఒక్కోసారి విపరీతమైన తలనొప్పికి ‘డీ హైడ్రేషన్’ కూడా కారణమవ్వచ్చు. అందుకని ఒక గ్లాసు నిండా చల్లటి నీళ్ళు తాగితే సరి. దాంతో తలనొప్పి క్రమంగా తగ్గుతుంది. ఒక గ్లాసు నిండా పాలు లేదా ఆరెంజ్ జ్యూస్ తాగడం లేదా మెగ్నీషియం, కాల్షియం ఉండే సప్లిమెంట్స్ తీసుకున్నా తలనొప్పి నుంచి రిలీఫ్ పొందవచ్చు. గోరువెచ్చని ఆవుపాలు తాగడం లేదా నీరు, వెల్లుల్లి మిశ్రమాన్ని ఒక టేబుల్ స్పూన్‌లో తీసుకుంటే ఉపశమనం పొందవచ్చు.

మన అరచేతిలో ముఖ్యంగా మన చూపుడు వేలుకు, బొటన వేలుకు మధ్య ఉండే ప్రదేశంలో కరెక్టుగా ప్రెజర్ పాయింట్స్ ఉంటాయి. వాటిని 2, 3 నిమిషాల పాటు నొక్కి ఉంచినట్లయితే తలనొప్పి తగ్గిపోతుంది. ఓ గ్లాస్ వేడి నీటిలో కొంచెం నిమ్మరసం కలుపుకుని తాగితే తొందరగా ప్రభావం చూపుతుంది. పలు రకాల ఒత్తిళ్ల నుంచి ఉపశమనం పొందాలన్నా, టెన్షన్ నుంచి రిలాక్స్ అవ్వాలన్నా మసాజ్ చక్కటి పధ్ధతి. కొబ్బరినూనెతో నుదుటిపై పది పదిహేను నిమిషాల పాటు మసాజ్ చేయడం వల్ల తలనొప్పి దూరం అవుతుంది. తలనొప్పితో బాధ పడేవారు ఐస్ ప్యాక్‌ను తలకు పట్టిస్తే ఉపశమనం లభిస్తుంది.

Advertisement

Next Story

Most Viewed